కే విశ్వనాథ్ సినిమాలు అనగానే ఆయన హీరోయిన్ ని ఎంత అందంగా చూపిస్తారు అనే ఆసక్తి సినిమా చూసే ప్రేక్షకుల్లో ఉంటుంది. సినిమాకు వెళ్తే హీరోయిన్ ని అచ్చ తెలుగు అమ్మాయిలా చూసి మురిసిపోతూ ఉంటారు జనాలు. అలా అందంగా చూపించిన వారిలో సుహాసిని, మీనాక్షి శేషాద్రి వంటి వారు మన కళ్ళ ముందు ఇంకా కనపడుతూనే ఉంటారు. చీర కట్టు అయినా, లంగా ఓణీ అయినా సరే ఇంట్లో ఆడపిల్లను చూసిన ఫీల్ ఉంటుంది.
Also Read:నా తల్లి వేశ్య కాదు… గంగూబాయి కతియావాడి చిత్రం ఆపాల్సిందే
ఆపద్బాంధవుడు సినిమాలో మీనాక్షి శేషాద్రిని ఆయన ఎంతో అందంగా చూపించారు. ఔరా అమ్మకు చెల్లా పాటలో మీనాక్షి తెలుగు అమ్మాయిలానే ఉంటుంది. ఆ పాట ఇప్పటికి చూసినా సరే మీనాక్షి మనకు నచ్చుతుంది. ఇప్పుడు ఆమె ఎలా ఉంది అనేది చాలా మందికి తెలియదు. బాలీవుడ్ లో పెయింటర్ బాబు అనే సినిమాతో అడుగు పెట్టిన ఆమె… అతి తక్కువ కాలంలోనే అక్కడ నెంబర్ 1 హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
టాలీవుడ్ లో బ్రహ్మర్షి, విశ్వామిత్ర సినిమాతో మంచి పేరు రాగా ఆ తర్వాత కే విశ్వనాథ్ కంట పడటం తో ఆయన ఆపద్బాంధవుడు సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో ఆమె నటనతో చాలా బాగా ఆకట్టుకున్నారు. మీనాక్షి తెలుగులో చేసిన సినిమాలు తక్కువే. 95 లో హరీష్ మైసూర్ అనేవ్యక్తిని వివాహం చేసుకుని… అమెరికా వెళ్ళిపోయారు. అక్కడ ఆమె ఒక డాన్స్ స్కూల్ కూడా నడుపుతున్నారు. ఇక ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also:జీవన్ రెడ్డి హౌజ్ అరెస్ట్..!