1980 లో బాలనటిగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన మాజీ హీరోయిన్ రాశీ… తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. బాల నటిగా మంచి పేరు తెచ్చుకుని తండ్రి సహకారంతో హీరోయిన్ గా సెట్ అయ్యారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొన్నాళ్ళ పాటు సినిమాలకు రాశీ దూరంగా ఉంటూ వచ్చారు.
Also Read:భీమ్లా నాయక్ డేట్ ఫిక్స్… హిందీ నిర్మాత పట్టు ?
ప్రేమ వివాహం చేసుకున్న రాశీ… ఇప్పుడు అవకాశాల కోసం కష్టపడుతున్నారు. హీరోయిన్ గా ఉన్న సమయంలో మంచి సంబంధాలు వచ్చినా సరే వాటిని కాదని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక చిన్న సహాయక దర్శకుడ్ని ప్రేమించడం పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. ఆ దర్శకుడి పేరే శ్రీ ముని. రాశీ నటించిన పలు సినిమాలకు గాను ఆయన సహాయక దర్శకుడిగా పని చేసారు.
ఆ పరిచయం స్నేహం, స్నేహం కాస్త ప్రేమ, ప్రేమ కాస్తా పెళ్ళిగా మారాయి. ఆమెకు సంబంధాలు చూసే సమయంలో తండ్రి మరణం తో తన కష్టాలు అన్నీ… శ్రీమునితో పంచుకోవడం శ్రీముని కూడా ఆమెపై కాస్త శ్రద్ధ చూసుకోవడంతో… స్వయంగా తానే శ్రీమునిని పెళ్లి చేసుకుందామా అని అడిగారట. దానికి ఆయన కూడా ఒకే అనడం తో రెండు వైపులా పెద్దలు మాట్లాడి వివాహం చేసారట. ఈ విషయాలన్నీ ఆమె ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Also Read:బప్పి అంత్యక్రియలు పూర్తి