రవితేజా హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ఇడియట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రవితేజా ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం చూస్తున్న తరుణంలో వచ్చిన ఈ సినిమా ఆయనకు తిరుగులేని మాస్ ఫాలోయింగ్ తీసుకొచ్చింది అనడం లో సందేహం లేదు. అప్పటి వరకు రవితేజా విషయంలో ఆలోచించిన దర్శక నిర్మాతలు కూడా ఆ తర్వాత స్పీడ్ గా ముందుకు వెళ్ళారు.
Also Read:శర్వానంద్ సినిమాకు సుకుమార్ వాయిస్ ఓవర్
కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా తీసుకొచ్చిన అప్పు సినిమా సూపర్ హిట్ కావడంతో పూరి విషయంలో నిర్మాతలకు నమ్మకం పెరిగి పెట్టుబడి కోసం ముందుకు వచ్చినా… పూరి మాత్రం తానే నిర్మించాలి అని రెడీ అయ్యారు. పెట్టుబడి పెట్టడానికి అప్పు సినిమా ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ బాగా హెల్ప్ అయింది. దీనితో పూరి వెనక్కు తగ్గలేదనే చెప్పాలి. తిట్టుని సినిమా టైటిల్ గా పెట్టడానికి చాలా మంది ఇష్టపడలేదు.
కాని మాస్ కు దగ్గర కావాలంటే అదే బాగుంటుంది అని పూరి భావించాడు. హీరో అంటే స్ట్రైట్ గా ఉండాలి… చాదస్తం ఉండకూడదు అనే సిద్దాంతం లో నుంచి పుట్టింది ఈడియట్ సినిమా. కమీషనర్ కూతుర్ని, కానిస్టేబుల్ కొడుకు ప్రేమించడం సూపర్ డూపర్ కాన్సెప్ట్. ఇక ఈ సినిమా తో పూరి దశ తిరిగిపోయింది. తెలుగులో పూరి తీసిన బాచి సినిమా నచ్చలేదు. కాని అదే కథతో యువరాజు అని కన్నడలో తీస్తే సూపర్ హిట్ అయింది.
ఆ తర్వాత పూరి… రాజ్ కుమార్ ఫ్యామిలీకి దగ్గర అయ్యారు. అప్పుడు అప్పు సినిమా కథను రాజ్ కుమార్ కుటుంబానికి చెప్పారు. ఆ సినిమా కథ దాదాపు రెండు గంటలు చెప్పగా పునీత్ రాజ్ కుమార్ ను స్క్రీన్ కు పరిచయం చేయడానికి రాజ్ కుమార్ ఒకే చెప్పారు. వాస్తవానికి ఆ కథను ముందు తెలుగులో రవితేజా తో చెయ్యాలని చూసారు. కాని అది ఆలస్యం కావడంతో రాజ్ కుమార్ కుటుంబానికి కథ చెప్పారు.
ఈ చిత్రం 36 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 2 కోట్ల బడ్జెట్ తో ఆ సినిమాను నిర్మిస్తే పూరికి వచ్చింది 20 కోట్లు. 45 ప్రింట్లతో స్టార్ట్ అయిన సినిమా వంద ప్రింట్ లకు చేరుకుంది. 36 సెంటర్లలో వంద రోజులు ఆడింది. సొంత నిర్మాణ సంస్థ వైష్ణో లో ఆయన ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా మొత్తం హైదరాబాద్ లోనే షూట్ చేసారు. రెండు పాటలకు మాత్రమే బ్యాంకాక్ వెళ్ళారు. అప్పటి నుంచి పూరి బ్యాంకాక్ కు బాగా దగ్గరయ్యారు.ఇక ఈ సినిమాకు ముందు పవన్ కళ్యాణ్ ను అనుకున్నా సరే ఆయన బిజీగా ఉండటంతో రవితేజాకు వరించింది ఆ ఆఫర్.
Also Read:స్టార్ కాస్ట్… గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు సినీ ఎంట్రీ