టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సొంతగా ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు ఇటు సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇదిలా ఉంచితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ గా చెప్పుకునే సినిమా జానీ. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు. దాదాపు రెండేళ్ళు గ్యాప్ తీసుకుని చేసారు.
అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించగా పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించారు. 2003 లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ తో ప్రేమలో ఉన్న రేణు దేశాయ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా తర్వాత పవన్ కాస్త బాధ పడ్డారు అనే టాక్ కూడా వినిపించింది. ఈ సినిమా పవన్ కాకుండా మరో హీరో చేసి ఉండాల్సింది అంటున్నారు స్టార్ రైటర్.
ఆయన ఎవరో కాదు విజయేంద్ర ప్రసాద్. పవన్ కళ్యాణ్‌కు ఈ సినిమా సెట్ కాలేదు అని అన్నారు. అప్పటికి ఆయన క్రేజ్ తారాస్థాయిలో ఉంది అని పేర్కొన్నారు. అదే వేరే హీరోతో చేసి ఉంటే ఖచ్చితంగా జానీ మంచి హిట్ అయ్యేదని తెలిపారు. ఈ సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశారని ఆయన కొనియాడారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత పవన్ మరోసారి తన స్వీయ దర్శకత్వంలో సత్యాగ్రాహి సినిమా చేయాలనుకుని ఆగిపోయారు.