మన తెలుగు ప్రేక్షకులకు ఒకప్పుడు కే విశ్వనాథ్ సినిమాలు అంటే ఒక క్రేజ్. సినిమాలో మొదటి షాట్ నుంచి చివరి వరకు కూడా అద్భుతంగా ఉండేవి అనే మాట వాస్తవం. ఇక ఆయన సినిమాల్లో కామన్ గా కొన్ని సన్నివేశాలు కనపడుతూ ఉంటాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం.
Also Read:సచిన్ కాళ్లు పట్టుకున్న జాంటీ రోడ్స్… ఎందుకంటే ?
నది ఒడ్డున ఒక కుటీరం సెట్ కచ్చితంగా ఏర్పాటు చేస్తారు. సూత్రధారులు, స్వయంకృషి , స్వాతిముత్యం, శృతిలయలు, ఆపద్బాంధవుడు, శంకరాభరణం, చిన్నబ్బాయి, శుభప్రదం ఈ విధంగా ఏ సినిమా చూసినా కనపడుతూ ఉంటాయి.
ఇక మరో విషయానికి వస్తే… చాలా సినిమాల్లో హీరోయిన్ స్నానం చేస్తున్న సమయంలో కాళ్ళకు సబ్బు రాసే సన్నివేశం కచ్చితంగా ఉంటుంది. సాగరసంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం, స్వయంకృషి వంటి సినిమాల్లో ఇలాంటివి కనపడుతూ ఉంటాయి.
ఇక సింగిల్ పేరెంట్ లేదంటే అనాథ పాత్రల పిల్లలు మనకు కనపడతారు. శృతిలయలు, శంకరాభరణం, స్వాతిముత్యం, స్వర్ణకమలం, ఆపద్బాంధవుడు, సాగర సంగమం , స్వయంకృషి సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. ఇక హీరోకి ఒక పెద్దాయన చుట్టంగా లేదంటే ఫ్రెండ్ గా మంచి వెల్ విషర్ గా ఉండటమో జరుగుతూ ఉంటుంది. సిరిసిరిమువ్వ లో పూజారి పాత్ర, సీతామాలక్ష్మి లో స్టేషన్ మాస్టర్ పాత్ర ఆపద్బాంధవుడు లో జంధ్యాల గారి పాత్ర శుభసంకల్పంలో కూడా జంధ్యాల పాత్ర, సాగరసంగమం సినిమాలో శరత్ బాబు స్వయంకృషి, సిరివెన్నెల సినిమాల్లో కూడా అటువంటివి ఉంటాయి.
Also Read:సారు దూకుడులో అంత భయం ఉందా..?