ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో టీం ఇండియా బలమైన జట్టుగా ఉంది. ఐపిఎల్ వంటి మ్యాచులతో టీం ఇండియా కు క్రేజ్ మరింతగా పెరిగింది అనే చెప్పాలి. ప్రస్తుతం ఇండియా లో ఐపిఎల్ మ్యాచ్ లు ఆడటానికి చాలా వరకు విదేశీ ఆటగాళ్ళు ఆసక్త్జి చూపిస్తున్నారు అనే చెప్పాలి. ఇక 2003 ప్రపంచ కప్ తర్వాత టీం ఇండియా క్రేజ్ పెరిగింది అని చాల వరకు అంటూ ఉంటారు.
Also Read:కేసీఆర్ చిక్కుల్లో పడ్డారా?
అయితే గంగూలి కాదు ఇండియన్ క్రికెట్ కు ఊపు తెచ్చింది కపిల్ దేవ్ అంటారు క్రీడా పండితులు. ఇండియా తొలి ప్రపంచకప్ ను అంత ఈజీగా గెలవలేదు. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్లను ఓడించిన తర్వాత… జింబాబ్వే తో మ్యాచ్ లో గెలవడం మాత్రం ఒక సంచలనం అనే చెప్పాలి. 17 పరుగులకు టీం ఇండియా 5 వికెట్లు కోల్పోయిన సమయంలో కపిల్ దేవ్ ఆడిన ఇన్నింగ్స్ ఇండియన్ క్రికెట్ గతిని మార్చింది అనే చెప్పాలి.
కపిల్ దేవ్ ఆల్ రౌండర్ గా ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి బౌలర్లను అండగా చేసుకుని చేసిన 175 పరుగులే ఇండియను క్రికెట్ లో అత్యంత కీలకంగా చెప్పాలి. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది అంటే కపిల్ చలువే. ఆ పరుగుల ముందు సచిన్ రికార్డులు, ధోని ఫినిషింగ్ లు… రోహిత్ శర్మ చేసిన మూడు వన్డే డబుల్ సెంచరీలు ఏ మాత్రం కూడా పనికిరావు అంటారు. ప్రధాన బౌలర్ అయి ఉండి… జట్టుకి ధైర్యం నూరి పోసిన విధానం ఇప్పటికీ ఆశ్చర్యమే. ఇక ఫైనల్ మ్యాచ్ లో వీవ్ రిచర్డ్స్ ను క్యాచ్ తో వెనక్కు పంపడంతో ఇండియా ప్రపంచకప్ అందుకుంది. ఆ తర్వాత హాకీ క్రేజ్ కూడా పడిపోయింది.
Also Read:ఆ స్టేడియంలలో అనుష్క శర్మ ‘చక్ధా ఎక్స్‌ప్రెస్’ షూటింగ్