మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తమిళ సినిమా కత్తికి రీమేక్ గా ఈ సినిమాను చేసారు. ఈ సినిమా వసూళ్లు కూడా అప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. చిరంజీవి రీ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసిన నిర్మాత రామ్ చరణ్… కథను పూర్తిగా తెలుగుకి తగ్గట్టుగా మార్చి దర్శకుడు వీవీ వినాయక్ తో చేయించారు. ఎంతో మంది దర్శకులు ఎదురు చూసినా ఆయనే చేసారు.
చిరంజీవితో ఎలా సినిమా చేయాలి, ఆయన ఇమేజ్ కి ఏ సీన్ లు పడితే బాగుంటుంది అనే క్లారిటీ ఉన్న దర్శకుడు కావడంతో పూర్తి స్వేచ్చ ఇచ్చారు. ఇక ఆ సినిమాలో చిరంజీవి డబుల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం చిరంజీవి స్టెప్ లు చూసి షాక్ అయ్యారు. ఇక ఇదిలా ఉంచితే ఈ సినిమాలో విలన్ గా రాజశేఖర్ చేయాల్సి ఉంది. ఆయన చేయడానికి కూడా ముందుకు వచ్చారని టాక్.
కాని రాజశేఖర్ ఇమేజ్ కి సెట్ కాదనే భావనలో మళ్ళీ దర్శకుడు వెనకడుగు వేసారని ఈ విషయంలో రామ్ చరణ్ కూడా నో అన్నారని టాక్. అందుకే మరొకరిని విలన్ గా తీసుకున్నారు. ఇక రాజశేఖర్ ఈ సినిమా సమయంలోనే గరుడ వేగ అనే సినిమా చేసి హిట్ కొట్టారు. ఇప్పుడు ఆయన మళ్ళీ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.