టాలీవుడ్ లో త్రివిక్రమ్ సినిమాలు అంటే ఒక రేంజ్ ఉంటుంది అనే మాట వాస్తవం. ఆయన ఏ స్టార్ హీరోతో సినిమా చేసినా సరే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఆయన వాటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను దసరా సమయానికి విడుదల చేసే విధంగా త్రివిక్రమ్ ప్లాన్ చేసారు.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కథ సిద్దం కాగా త్వరలో కీలక సన్నివేశాల షూట్ ని జరిపే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ షూట్ కి సంబంధించి ఇప్పటికే మహేష్ బాబు కూడా కసరత్తులు మొదలుపెట్టాడు. నేపధ్యం ఎలా ఉంటుంది అనేది తెలియకపోయినా సినిమా షూట్ ఎక్కువగా బెంగళూరులో జరిగే అవకాశం ఉందని అలాగే కర్ణాటక తీర ప్రాంతంలో షూట్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
అయితే ఈ సినిమా షూట్ విషయంలో త్రివిక్రమ్ బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదని సమాచారం. సినిమా కోసం పది కోట్ల విలువ చేసే ఇంటి సెట్ ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కర్ణాటకలో బీచ్ దగ్గర ఈ సెట్ వేస్తున్నారట. ఒక వ్యాపారవేత్త కొడుకుగా మహేష్ బాబు నటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో మాజీ హీరోయిన్ భూమిక నటించే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్.