మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయన మాట్లాడే మాటలు, నవ్వే నవ్వులు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. ఆ ఎన్నికల్లో మంచి విజయం సాధించిన తర్వాత మంచు విష్ణు కాస్త ఎక్కువ సందడి చేస్తున్నారు. హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే మంచు విష్ణు తర్వలో ఒక సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి.
Also Read:మణిపూర్ తొలిదశ ఎన్నికల్లో 21శాతం నేరచరితులే
ఇక మంచు విష్ణు భార్య విరానికా రెడ్డి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త సెర్చ్ చేస్తున్నారు. ఇక ఆమె గురించి తెలియని విషయాలు ఒకసారి చూద్దాం.
విరానిక రెడ్డి… వైఎస్ జగన్ కు వరుసకు చెల్లెలు. ఆయన బాబాయి వైఎస్ సుధాకర్ రెడ్డి ఆమె కుమార్తె. అమెరికాలో పుట్టి అక్కడే పెరిగిన ఆమె ఆ తర్వాత ఇండియా వచ్చారు. ఈ సమయంలో ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. విరానికా కుటుంబానికి ఆఫ్రికాలో బాగా వ్యాపారాలు ఉన్నాయి.
విష్ణు విరానికా దంపతులకు నలుగురు పిల్లలు. ఆమె సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. సోషల్ మీడియాలో తన ఫోటోలను కూడా ఆమె ఇష్టపడరు. కుటుంబానికి ఎక్కువగా సమయం కేటాయిస్తూ ఉంటారు. బాల్యంలో విరానికా… డాక్టర్ కావాలని కలలు కన్నారు. కాని రాజకీయ నేపధ్యం ఉన్నా సరే అటువైపు చూడలేదు.