సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన మహేష్ బాబు… మొదటి సినిమాతో మంచి విజయం సాధించి కెరీర్ ను ఘనంగా మొదలు పెట్టాడు. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలకు మొదటి సినిమా హిట్ ఉండాలనే తపన ఉంటుంది. మహేష్ కూడా మంచి విజయం తో వచ్చినా ఆ తర్వాత రెండు మూడు సినిమాలు షాక్ ఇవ్వడంతో మహేష్ కెరీర్ పై అనేక అనుమానాలు వచ్చాయి. దీనితో కచ్చితంగా మంచి హిట్ తో టాలీవుడ్ లో నిలబడాలని తపనతో ముందుకు వెళ్ళాడు.
Also Read:కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రీబిడ్ సమావేశం

లేదంటే మాత్రం మహేష్ బాబు తన స్థాయిని అందుకోవడం కష్టమయ్యేది. ఈ టైం లో కృష్ణ వంశీతో మురారి అనే సినిమాకు సైన్ చేసాడు మహేష్ బాబు. ఈ నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరు కూడా తప్పుబట్టారు. మహేష్ తండ్రి కృష్ణ కూడా వద్దని చెప్పేశారు. ఆ కథతో సినిమా వద్దని కృష్ణ… కృష్ణ వంశీకి చెప్పినా సరే కృష్ణ వంశీ మాత్రం వెనక్కు తగ్గలేదట. మహేష్ బాబు కూడా ఆ సినిమా విషయంలో వెనక్కు తగ్గకపోవడంతో సినిమా ముందుకు వెళ్ళింది.
దర్శకుడు కృష్ణ వంశీ… నిర్మాతలకు మధ్య గొడవలు కూడా అయ్యాయి. ఒక పాట విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో సినిమా ఆగిపోతుందని భావించారు. దీనితో కృష్ణ రంగంలోకి దిగి ఆ సమస్యకు పరిష్కారం చూసారు. ఇక సినిమా అన్ని పూర్తి చేసుకుని 2001 లో విడుదల అయింది. ఫిబ్రవరి 17 న సినిమాను విడుదల చేసారు. మొదటి షో తో సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. కృష్ణ కుటుంబ అభిమానులే ఆ విషయం చెప్పారు. వాళ్ళు ఆశించినవి సినిమాలో లేవు. అయితే క్లాస్ ఆడియన్స్ మాత్రం సినిమాను ఆకాశానికి ఎత్తేసారు.
సాయంత్రం షో లకు సినిమా హాల్స్ ఫుల్ అవుతున్నాయి. మాస్ సెంటర్ లలో కూడా సినిమాకు మంచి పేరు రావడం మొదలయింది. దీనితో కృష్ణ సాయంత్రం షో కి వెళ్లి సినిమా చూసి… ప్రేక్షకుల స్పందన చూసి షాక్ అయ్యారట. ఇక మహేష్ నటన కూడా చాలా బాగుంది అని విమర్శకులు కూడా చెప్పడంతో… కృష్ణ సంతోషం లో మునిగిపోయారట. ఒక ప్రయోగం తో ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
Also Read:సింగరేణికి అత్యున్నత పురస్కారం