ఇప్పుడు సినిమా హీరోలు గాని ఇతర నటులు గాని కలిసి ఉంటే అది కచ్చితంగా కమర్షియల్ కోణం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఇదే జరుగుతుంది. కాని ఒకప్పుడు ఇలా ఉండేది కాదు పరిస్థితి. చాలా మంది నటుల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. గొడవలు ఉన్నా వెంటనే పరిష్కరించుకుని ఒక కుటుంబం మాదిరి కలిసి ఉండేవారు.
ఇందులో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉండేవారు. దాదాపుగా అందరితో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి అంటారు. ప్రతీ హీరో, హీరోయిన్ తో కలిసి మెలిసి ఉండేవారు. ఆయన కంటే సీనియర్ నటులను అమితంగా గౌరవించే వారు ఎన్టీఆర్. సూర్యకాంతం ను అత్తా అని పిలిచేవారు. పండరీ బాయిని అమ్మా అని పిలిచారు. సావిత్రిని అయితే సొంత చెల్లెలుగా చూసేవారు అని అంటారు.
ఇక ఎన్టీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉండే చిత్తూరు నాగయ్యను నాన్న అని పిలిచేవారు ఎన్టీఆర్. అలాగే వర లక్ష్మిని అయితే కోడలు అని పిలిచేవారు ఎన్టీఆర్. ఇలా ఆయన సినిమా పరిశ్రమలో అందరితో కుటుంబ సభ్యుడిగా కలిసి మెలిసి ఉండేవారు. ఆమె ఎన్టీఆర్ కు కోడలి పాత్రలో నటించింది. ఆ పాత్ర ఎన్టీఆర్ కు బాగా నచ్చేసింది. అందుకనే ఆయన ఆమెను కోడలా అని పిలిచేవారు.