నందమూరి కుటుంబంలో ఇప్పుడు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ హవా ఎక్కువగా ఉందనే మాట వాస్తవం. వీళ్ళు ఇద్దరూ వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి తో సినిమా చేస్తుంటే… బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. వీరి ఇద్దరి సినిమాల కోసం నందమూరి అభిమానులు ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.
Also Read:తండ్రి అయిన రామ్ చరణ్
చిన్న వయసులోనే మంచి హిట్స్ తో ఒక రేంజ్ కి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ఫ్యాన్స్ ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వెండితెర తో పాటుగా బుల్లి తెర మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ సందడి చేస్తూ ఉంటారు. ఇక ఇదెలా ఉంటే తన భార్య, పెళ్లి గురించి జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. లక్ష్మీ ప్రణతి ని పెళ్లి చూపుల్లో చూసేందుకు ఎన్టీఆర్ వెళ్ళాడు. ఆ తర్వాత ఆమెతో మాట్లాడితే ఆమె ఏ విషయం చెప్పలేదట.
8 నెలల గ్యాప్ వచ్చింది పెళ్ళికి పెళ్లి చూపులకి. ఆ గ్యాప్ లో ఎన్నో విషయాలు లక్ష్మీ ప్రణతిని అడిగితే ఆమె నుంచి నో అనే ఆన్సర్ వచ్చిందట. అప్పుడు ఎన్టీఆర్ కు… ఆడవాళ్ళ మనసులో ఏం ఉందో తెలుసుకోవడం కష్టం అనే విషయం అర్ధమైందట. అది తెలిసిన వాడే ప్రపంచాన్ని ఏలుతాడని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read:ఏప్రిల్ నుంచి పూరి, విజయ్ దేవరకొండ సినిమా