తెలుగు సినిమా ఎప్పటికి మర్చిపోలేని నటుల్లో ఎన్టీఆర్, శ్రీదేవి ఉంటారు అనే మాట వాస్తవం. సినిమా ప్రేక్షకులకు ఈ జంట పంచిన వినోదం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో వీళ్ళ కాంబినేషన్ చూడటానికి చిన్నా పెద్ద అనే తేడా లేకుండా వెళ్ళే వాళ్ళు సినిమా హాల్స్ కి. ఇక వీళ్ళ విషయంలో ఎన్నో వార్తలు వచ్చేవి. అయినా సరే పట్టించుకోకుండా మంచి సినిమాలు చేసారు ఇద్దరూ.
Also Read:ఆ భవనాన్ని కూల్చివేయాలని అధికారుల నిర్ణయం
ఇక శ్రీదేవిని ఎన్టీఆర్ ఆట పట్టించిన విధానం అప్పట్లో హైలెట్ అని అంటారు. ఎందరో హిట్ దర్శకుల కాంబినేషన్ లో వీళ్ళు చేసారు. ఎన్టీఆర్ కు తెలుగు అంటే మమకారం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఆయన డైలాగుల్లో ఎక్కడా కూడా ఇంగ్లీష్ వద్దు అనే వారు. హీరోయిన్లు డబ్బింగ్ చెప్పే సమయంలో కూడా గమనించి ఇంగ్లీష్ డైలాగులు లేకుండా చూసేవారు ఎన్టీఆర్. దీనితో డైలాగులు రాసేవాళ్ళు కాస్త ఇబ్బంది పడేవారు.
దాసరి, రాఘవేంద్ర రావు వంటి అగ్ర దర్శకులు అయితే ఎన్టీఆర్ కు నచ్చజెప్పే వారట. ఇక శ్రీదేవి డబ్బింగ్ చెప్పే సమయంలో ఎన్టీఆర్ కామెడి చేసేవారట. కాస్త గట్టిగా తింటే డైలాగ్ బలంగా వస్తుంది అనేవారట. కీచు గొంతు అని కూడా ఆమెను కామెంట్ చేసేవారట. ఆమె అలగడంతో దర్శకులు నచ్చజెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శ్రీదేవి కూడా ఎన్టీఆర్ ఉంటే తాను డబ్బంగ్ చెప్పను అనేవారట.