ఎవరెన్ని చెప్పినా ఎన్టీఆర్ అంటే తెలుగు సినిమా, తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్. తెలుగు సినిమా మీద ఆయన ఆ విధంగా బలమైన ముద్ర వేసారు. ఎందరో యువ నటులకు అప్పట్లో స్పూర్తిగా నిలిచారు. ఆయన సంపాదన అప్పట్లో ప్రముఖ వ్యాపారులను సైతం నివ్వెర పరిచింది. కోట్ల రూపాయల ఆస్తులను ఆయన సంపాదించారు. ఇక ఆయన జీవితంలో ఎన్నో మెరుపులు, ఎన్నో కనపడని ఇబ్బందులు.
Also Read:భారీ ధరకు ఆర్ఆర్ఆర్ మలేషియా హక్కులు
ఒక జ్యోతిష్యుడు మాట విని ఎన్టీఆర్ కోట్ల రూపాయల ఆస్తులు వదులుకున్నారు. 1960 తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ బాగా పెరిగింది. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే లక్షల మంది అభిమానులు సినిమా థియేటర్ ముందు ఎదురు చూసారు. ఆయన నటించిన పౌరాణిక పాత్రలకు చాలా మంచి గుర్తింపు ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో ఆ పాత్రలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.
దీనితో ఆయన ఆ పాత్రలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. స్వయంగా ఆయనే దర్శకత్వం వహించిన సినిమాలు సైతం ఉన్నాయి. 1962 దక్ష యజ్ఞం అనే సినిమాను తీసుకొచ్చారు. ఈ సినిమా మొత్తం శివుడి పాత్ర చుట్టూనే ఉంటుంది. రెండేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా… భారీ వసూళ్లు రాబట్టింది. సినిమా 50 వ రోజు ఫంక్షన్ ను విజయవాడ లోని దుర్గా కళామందిరం హాల్ దగ్గర చేయాలని భావించారు.
ఎన్టీఆర్ చెన్నై నుంచి బయలుదేరి వచ్చే సమయైకి పెద్దకుమారుడు నందమూరి రామకృష్ణ కన్నుమూసారు. దీనితో ఎన్టీఆర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ తర్వాత ఒక రోజు ప్రముఖ దర్శకుడు విఠాలాచార్య ఎన్టీఆర్ ఇంటికి వచ్చారు. ఆయన అంటే ఎన్టీఆర్ కు విపరీతమైన అభిమానం. ఆయనతో పాటుగా ఒక జ్యోతిష్యుడు కూడా వచ్చాడు. అప్పటికి ఎన్టీఆర్ ఇంకా రామకృష్ణ పోయిన బాధలోనే ఉన్నారు.
ఆ సమయంలో జ్యోతిష్యుడు ఎన్టీఆర్ కు ఒక సంచలన విషయం చెప్పారు. మీరు పరమ శివుడి వేషం ఇకపై వేయకుండా ఉండటం మంచిది. అది వేయడం తోనే మీ అబ్బాయి ప్రాణాలు కోల్పోయారు అంటూ ఎన్టీఆర్ జాతక వివరాలను ఆయనకు ఇచ్చారు. దీన్ని ఎన్టీఆర్ నమ్మకపోతే విఠాలాచార్య మాత్రం జ్యోతిష్యం నమ్మాలని చెప్పడంతో ఎన్టీఆర్ నమ్మారు. ఆ తర్వాత శివుడి వేషం గురించి ఎన్ని ఆఫర్లు వచ్చినా సరే ఎన్టీఆర్ చేయలేదు. ఎన్టీఆర్ ఆ పాత్రలు చేసి ఉంటె కోట్ల రూపాయలు వచ్చి ఉండేవి అంటారు ఆయన గురించి తెలిసిన వారు.
Also Read:ప్రధాని మోడీకి బంగ్లా ప్రధాని కృతజ్ఞతలు