టాలీవుడ్ లో ఇప్పుడు పవిత్రా లోకేష్, నరేష్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతుంది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కూడా కాస్త ఈ విషయంలో న్యాయపోరాటానికి సిద్దం అవుతున్నారు. ఈ ఏడాది వీళ్ళు ఇద్దరూ యూరప్ వెళ్లి పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ పెళ్ళికి సంబంధించి ఇంకా క్లారిటీ లేకపోవడంతో తేదీ బయట పెట్టలేదు అని సినీ వర్గాలు అంటున్నాయి.
Also Read:”మమ్మల్ని ఒకసారి టచ్ చేయనివ్వండి”!!
నరేష్ గురించి దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా అందరికి తెలిసిందే. విజయ నిర్మల కుమారుడిగా ఆయనకు ఒక పేరు వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షుడిగా కూడా పని చేసారు. మరి పవిత్ర లోకేష్ బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అనే దానిపై చర్చ జరుగుతుంది. పవిత్ర లోకేష్ సొంత రాష్ట్రం కర్ణాటక కాగా ఆమె తండ్రి కూడా నటుడే. తండ్రి సినిమాల్లో ఉండటంతో ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టమట.
ఇక తండ్రి చిన్న వయసులోనే మరణించడంతో సినిమాల్లోకి రావాలని నిర్ణయం తీసుకుంది. కుటుంబ పోషణ భారం మొత్తం ఆమె మీద పడింది. చిన్నా చితకా పాత్రల్లో నటిస్తూనే చదువు మీద కూడా ఫోకస్ చేసింది. సివిల్స్ ప్రిపేర్ అయిన ఆమె ఐఏఎస్ కావాలని భావించింది. కాని సినిమాల్లో మంచి అవకాశాలు రావడంతో ఈ దిశగానే అడుగులు వేసింది. ఆమె 16 ఏళ్లకు కన్నడ టీవీ చానల్స్ లో నటించడం మొదలుపెట్టింది. ముందు ఆమెకు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో వివాహం జరిగింది. ఏడాదికే మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. తర్వాత సుచేంద్ర ప్రసాద్ అనే టీవీ నటుడిని పెళ్లి చేసుకుంది. అక్కడ కూడా విడిపోయి ఇప్పుడు నరేష్ ను చేసుకుంటుంది.