తెలుగు సినిమా పరిశ్రమలో నట కిరీటీ రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ఆయన కామెడీ రంగాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్. చాలా మందికి తెలియని విషయం రాజేంద్ర ప్రసాద్ కి ఎన్టీఆర్ వరుసకు మేనమాన. దూరపు చుట్టమే అయినా ఇద్దరి ఇల్లు నిమ్మకూరులో పక్క పక్కనే ఉంటుంది.
Also Read:పెండింగ్.. పెండింగ్.. సుప్రీం కోర్టులో కేంద్ర, రాష్ట్రాల కేసులు ఎన్నంటే ?
ఒకప్పుడు ఎన్టీఆర్… రాజేంద్ర ప్రసాద్ ఇంట్లోనే అద్దెకు ఉండేవారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే క్రమంలో ఆయన ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని మద్రాస్ యాక్టింగ్ స్కూల్ లో నటన నేర్చుకుని… సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం చేసే వారు. నటన యాక్టింగ్ పూర్తి అయిన తర్వాత కొన్నాళ్ళ పాటు రాజేంద్ర ప్రసాద్ సైలెంట్ గా ఉన్నారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే పుండరీకాక్షయ్య తో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం అనుకున్నారు ఆయన.
అప్పటికి నెల రోజుల నుంచి అరటి పళ్ళు మాత్రమే తినే వాళ్ళు ఆయన. పుండరీకాక్షయ్య అదే సమయానికి ఏదో చర్చలో హీరోకి డబ్బింగ్ ఎవరిది బాగుంటుంది అని ఆలోచిస్తే రావయ్య ప్రసాదు నువ్వే డబ్బింగ్ చెప్పాలని అవకాశం ఇస్తే… రాజేంద్ర ప్రసాద్ అలా కొత్త వారు అందరికి డబ్బింగ్ చెప్పారు. అలా చెన్నై లో ఇల్లు కొనుక్కున్నారు.
ఒక రోజు నిమ్మకూరులో ఎన్టీఆర్ వద్దకు వెళ్ళగా ఏం చేస్తున్నావని అడిగితే ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నాను సినిమాల్లో హీరో అవ్వాలి అనుకుంటున్నా అన్నారు. ఆ మాట విని ఎన్టీఆర్ నవ్వేసారట. పౌరాణికాలకు నేను, ప్రేమ చిత్రాలకు నాగేశ్వరరావు, ఫైటింగులకు కృష్ణ, అందానికి శోభన్ బాబు ఉంటే నువ్వేం చేస్తావని అడిగారట. ఆయన మరో ఆలోచన లేకుండా కామెడి సినిమాలు చేస్తా అని చెప్పెసారట. అలా కామెడి సినిమాలు చేస్తూ అగ్ర హీరో అయిపోయారు.
Also Read:పాక్ కు భారత యాత్రికులు… ఐదేండ్లలో ఎంత మంది అంటే ?