టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా రామ్ గోపాల్ వర్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేసిన వర్మ ఇప్పుడు కాస్త వివాదాలతో ఇబ్బంది పడుతున్నారు. తనకు సంబంధం లేని రాజకీయాల్లో కూడా ఆయన వేలు పెడుతున్నారని ఫాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్మకు కొందరు హీరోయిన్లు అంటే అప్పట్లో చాలా ఇష్టం ఉండేది.
Also Read:అలీ ఆస్తులు తెలిస్తే షాక్ అవుతారు…!
అందులో శ్రీదేవి, ఊర్మిళ ముందు వరుసలో ఉండేవారు. శ్రీదేవి విషయంలో వర్మకు ఉన్నది ప్రేమ కంటే కూడా గౌరవం అని అంటారు జనాలు. ఆమె విషయంలో ఏ విధమైన నెగటివ్ కామెంట్స్ కూడా వర్మ ఏ రోజు చేయలేదు అనే విషయం తెలిసిందే. ఇక ఊర్మిళ విషయానికి వస్తే ఆమెను కూడా ఎక్కువగానే ఇష్టపడ్డాడు వర్మ. ఆమెతో నాగార్జున హీరోగా అంతం అనే సినిమా చేస్తే అది వర్మకు షాక్ ఇచ్చింది.
ఆ సినిమా ఫ్లాప్ కావడంతో మళ్ళీ ఊర్మిళ హీరోయిన్ గా ఒక సినిమా చేసాడు వర్మ. అదే సత్య సినిమా. బాలీవుడ్ లో ఈ సినిమా ఘన విజయం సాధించింది. సత్య అనే సినిమాకు పేరు పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. సత్య అనే అమ్మాయిని వర్మ ప్రేమించాడు. దీనితోనే ఆ పేరు పెట్టాడు. ఊర్మిళ మీద, సత్య అనే అమ్మాయి మీద ప్రేమతో చేసిన సత్య అనే సినిమా వర్మకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
Also Read:మోర్బీ ఘటనపై నీళ్లు నములుతున్న గుజరాత్