ఉప్పు చేతికి. ఇవ్వకూడదు, ఉప్పు అప్పు ఇవ్వకూడదు అంటూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు ఆ విధంగా చేస్తారు అనేది చాలా మందికి తెలియదు. సైంటిఫిక్ గా దాని వెనుక కారణాలు ఏంటో చూద్దాం. ఉప్పుకి నీరుని పీల్చే గుణం కొంత ఎక్కువే ఉంది. పూర్వం ఉప్పు అమ్మే వారు… దాన్ని చేత్తో తీసుకుంటే నీటిని పీల్చుకుంటుంది అని ఏదొక వస్తువు తో దాన్ని జరపడం సర్దడం చేసే వారు.
Also Read:జూనియర్ ఎన్టీఆర్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ఉప్పు చేత్తో ఎక్కువ సేపు పట్టుకుంటే, చేతి మీద నీరు పీల్చి, అరచెయ్యి పైన నీరు పోయి కొంత సేపు చర్మం పైన ముడతలు ఏర్పడతాయి. ” ఉప్పు కట్టు” అని చిన్నప్పుడు వినే ఉంటారు. వేయించిన ఉప్పు గుడ్డలో కట్టి నీరు పట్టిన చోట పెడితే చర్మం దిగువనున్న నీరు క్రమంగా తగ్గేది. ఇప్పుడు ఈ పరిష్కారం కోసం డాక్టర్లు మెగ్నీషియం సల్ఫేట్, గ్లిసరిన్ డ్రెస్సింగ్ గా నొప్పికి, నీరుకి వాడతారు. ఉప్పు సముద్రంలో నుండి వస్తుంది కాబట్టి ఉప్పును లక్ష్మీ దేవికి సోదరిగా గౌరవం పొందుతుంది అని చెప్తారు.
అందుకే ఉప్పులో డబ్బులు పెడితే డబ్బులు పెరుగుతాయి అని ఇంట్లో ఆడవాళ్లు నమ్ముతూ ఉంటారు. ఉప్పు కూడా లక్ష్మీ రూపం కాబట్టి ఊరకే ఎవరికి ఇవ్వకూడదు అని చెప్తారు. ఉప్పు చేతిలో ఎక్కువ సేపు ఉంటె స్కిన్ పగిలిపోయే అవకాశాలు కూడా ఎక్కువ. ఉప్పును నెగటివ్ ఎనర్జీ తీయడానికీ అంటే దిష్టి తీయడానికి వాడతారు కాబట్టి చేత్తో తీసుకోవడం మంచిది కాదు అంటారు. అందుకే ఉప్పు తీసుకోవడం తో గొడవలు అవుతాయని, దొంగతనం చేస్తే శని అని చెప్తారు.