ఎన్టీఆర్ – శ్రీదేవి కాంబినేషన్ కు అప్పట్లో చాలా మంచి క్రేజ్ ఉండేది. వీళ్ళ జోడి స్క్రీన్ మీద కనపడితే ఫాన్స్ కు పండగ అన్నట్టుగా ఉండేది అనే మాట వాస్తవం. ఎన్టీఆర్ కు ముందు కూతురుగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన పక్కన నటించింది. ఎన్టీఆర్ తో ఆమెకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆమెకు ఆర్ధికంగా ఎలా ఉండాలి అనే దాని మీద సలహాలు కూడా ఇచ్చే వారు అని అంటారు.
Also Read:సావిత్రి, సౌందర్య, సాయి పల్లవికి ఉన్న పోలిక తెలుసా…?
ఎన్టీఆర్ సినిమాల్లో శ్రీదేవి కనపడితే హౌస్ ఫుల్ బోర్డ్ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అప్పట్లో. ఇక అక్కినేని – శ్రీదేవి జంటకు కూడా అప్పట్లో మంచి డిమాండ్ ఉండేది. వీళ్ళ కాంబినేషన్ కూడా ప్రేక్షకులు ఆదరించారు. అయితే ఎన్టీఆర్ తో తో సాన్నిహిత్యం మాత్రం అక్కినేనితో లేదని అంటారు. దానికి ఉదాహరణ ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ పక్కన ముందు బడిపంతులు సినిమాలో ఆమె కూతురిగా నటించింది.
ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఎన్టీఆర్ ను శ్రీదేవిని ఒప్పించి దాసరి… బొబ్బిలి పులి అనే సినిమా చేసారు. ఆ సినిమా అప్పుడు శ్రీదేవికి 22 ఏళ్ళు. ఎన్టీఆర్ కు 50 పైనే ఉన్నాయి. దీనితో ఎన్టీఆర్ ను ఆమె అంకుల్ అని పిలిచేవారు. ఎన్టీఆర్ ఆ మాటకు నవ్వుకునే వారట. అయితే అక్కినేనిని మాత్రం సర్ అని పిలిచేవారు శ్రీదేవి.