సౌత్ ఇండియా లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు శంకర్ అనే మాట వాస్తవం. ఆయనతో సినిమాలు చేసేందుకు తమిళ, తెలుగు స్టార్ హీరోలు ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన తీసిన సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ గా మంచి విజయాలు అందుకున్న మాట వాస్తవం. ఇక అగ్ర హీరోలతో చేసిన సినిమాలకు మంచి మార్కులు పడుతూ ఉంటాయి. ఇప్పుడు తెలుగులో రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు.
Also Read:శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. భక్తుల పరవశం
ఈ ఏడాది ఆయన సినిమా విడుదల కానుంది. శంకర్ మొదటి సినిమా గురించిన విశేషాలు తెలుసుకుందాం. ఆయన మొదటి సినిమా కుంజుమన్ అనే తమిళ స్టార్ నిర్మాతతో సినిమా చేసారు. శంకర్ లో టాలెంట్ గుర్తించిన ఆయన జెంటిల్మెన్ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. ఆ సినిమాకు పెట్టుబడి ఏ మాత్రం ఆలోచించకుండా పెట్టారు నిర్మాత. సినిమా కూడా భారీ విజయం సాధించింది.
ఈ సినిమా విజయం తర్వాత సినిమా యూనిట్ కి భారీ గిఫ్ట్ లు ఇచ్చారు శంకర్ కి అత్యంత లగ్జరీగా ఉండే దేవార్ ఆఫీసును ఆయన గిఫ్ట్ గా ఇచ్చారు. సెలబ్రిటీలు అందరూ వాడే మారుతి 800 కారును ఆయన ఉపయోగించారు. శంకర్ దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికి స్కూటర్లు కూడా ఇచ్చారట. సాంకేతిక నిపుణులకు వారి వారి అసిస్టెంట్స్ అందరికీ బంగారు నాణాలను కూడా ఇచ్చారు. ఆ తర్వాతి సినిమా కూడా శంకర్ ఆయనతోనే చేసి ప్రభుదేవాని హీరోని చేసారు.
Also Read:బీజేపీ లక్ష్యమదే… సీఏఏపై అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు….!