సియాచిన్ గ్లేషియర్” ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం. భారతీయులకు మంచు కొండంత ధైర్యం. సరిహద్దుల్లో కాచుకుని కూర్చున్న పాకిస్తాన్ సైనికుల నుంచి సియాచిన్ ను భారత్ కాపాడుకోవడం కోసం ప్రతీ ఏటా వెయ్యి కోట్లకు పైగానే ఖర్చు చేస్తుంది. శత్రువు కంటే కూడా అక్కడ ప్రకృతే సైనికులకు ప్రధాన శత్రువు. పాకిస్తాన్ కంటే మన సైన్యం వేల అడుగుల ఎత్తులో ఉన్నా సరే భారత ఆర్మీ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది.
Also Read:క్రికెట్ లో అత్యంత పొట్టి క్రికెటర్ లు వీళ్ళే…!
ఇక అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా అక్కడ చలికాలంలో 7 గంటలు మాత్రమే పగలు ఉంటుంది. మిగిలిన సమయం మొత్తం కటిక చీకటి. ఇక ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీలకు పైనే ఉంటుంది. మన దగ్గర రైస్ ఉడకాలి అంటే మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది. కాని అక్కడ మాత్రం కనీసం 20 విజిల్స్ రావాలి. ఆక్సీజన్ లెవెల్స్ చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి… సైనికులు గంటల తరబడి నిద్రపోవడానికి అవకాశం ఉండదు.
అందుకే రాత్రి సమయంలో సైనికులను గార్డులు నిద్ర లేపుతూ ఉంటారు. ఆక్సీజన్ అందదు కాబట్టి సైనికుల ప్రాణాలు నిద్రలోనే పోయే అవకాశం ఉంటుంది. ఇక షేవింగ్ చేసుకుంటే ఒక్కోసారి స్కిన్ తెగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే సైనికులు షేవింగ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఇక ఇక్కడ ఆఫీస్ మొత్తం ఫైబర్ తో చేసినవే ఉంటుంది. స్టీల్ ను తక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా శరీరం స్టీల్ వస్తువులకు తగిలితే ఆ శరీర భాగాలూ సెన్స్ లెస్ అయ్యి ప్రమాదానికి దారి తీస్తాయి.
ఒక్కో సందర్భంలో ఆ శరీర భాగాలు శాశ్వతంగా తొలగిస్తారు. ఇక మరో కీలక విషయం ఏంటీ అంటే ఎల్లప్పుడు మంచు కురుస్తుంది కాబట్టి… మంచు పడిన వెంటనే సైనికులు ఉండే నాలుగు వైపులా మంచు తొలగించాలి. అశ్రద్ధ చేస్తే మాత్రం ఆ మంచు రాయి గా మారి… లోపల ఉండే సైనికులు సమాధి అయిపోయే అవకాశాలు ఎక్కువ. వెహికల్స్ కి చైన్ వేసి నడుపుతారు లేకుంటే మంచులో స్కిడ్ అయ్యి వెహికల్స్ లోయలలోకి వెళ్ళిపోతాయి.
ఇక సైనికులు అర్ధరాత్రి పెట్రోలింగ్ లాంటి కార్యక్రమాలకి బయలుదేరుతారు. ఎందుకంటే ఆ సమయంలో గాలి వేగం తక్కువగా ఉంటుంది. నక్షత్రాల, చందమామ వెలుగులో మంచు కొండ క్లియర్ గా కనపడుతుంది. ఇక సైనికులు పగలు సమయంలో సూర్యుడ్ని డైరెక్ట్ గా చూస్తే కంటి చూపు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సైనికులు సియాచిన్ కు వెళ్ళే సమయంలో మోసే బరువు దాదాపు వాళ్ళ బరువుతో సమానంగా ఉంటుంది.
Also Read:వరుణ్, కియారాపై నెటిజన్ల ఫైర్.. ఏం జరిగిందంటే?