మన తెలుగులో శివ సినిమాకు ముందు శివ సినిమా తర్వాత అనే విధంగా సాంకేతికత అభివృద్ధి చెందింది. ఆ సినిమా నాగార్జున, రామ్ గోపాల్ వర్మకు మర్చిపోలేని సినిమా అయినా ఆ సినిమా తర్వాత దర్శక నిర్మాతల ఆలోచన చాలా మారిపోయింది అనే మాట వాస్తవం. దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ ఆలోచన ఎలా ఉంటుంది అనేది ఆ ఒక్క సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో ఎన్నో సంచలనాలు నమోదు అయ్యాయి.
Also Read:రాష్ట్రపతి పాదాలకు నమస్కరించేందుకు యత్నం… అధికారిణిపై…!
వాడిన కెమెరాల నుంచి ఎన్నో అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. స్టడీ కాం వాడటం ఆ సినిమాతోనే మొదలయింది. ఆ తర్వాత చాలా మంది దర్శకులు ఆ కెమెరాలను బుక్ చేసుకున్నారు. అలాగే బాక్సింగ్ పంచ్ లను కూడా రామ్ గోపాల్ వర్మ నాగార్జునతో చేయించారు. అదే విధంగా విలన్ కు భవాని అనే పేరు పెట్టడం వెనుక విజయవాడలో ఒక రౌడీ పేరు ఉంది. ఆ పేరునే ఆయన విలన్ కు పెట్టారు.
ఇక సైకిల్ చైన్ సీన్ విషయంలో ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆ సీన్ షూట్ కి ముందు రోజు రాత్రి చాలా కష్టపడ్డారు. తానే డైరెక్ట్ గా ఆ చైన్ తెంపడానికి చూసారు. కాని అది తెగలేదు… దీనితో మరో విధంగా ఆలోచించారు. ఎలా అయినా చైన్ తెంపే సీన్ కావాలనుకున్నారు. అందుకని నాగార్జునతో ఆ సీన్ చేయించారు. ఆ సీన్ హీరో రేంజ్ ని పెంచింది.
Also Read:ఇదేం బాదుడురా నాయనా.. మళ్లీ సెంచరీ..!