అటు తమిళంలో ఇటు తెలుగులో సూపర్ హిట్ కొట్టిన సినిమా శివాజీ. సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇమేజ్ కి తగిన విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇక విలన్ గా నటించిన సుమన్ కూడా చాలా బాగా నటించారు. ఇక రజనీ కాంత్ ను శంకర్ చూపించిన విధానం చూసి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఫీల్ అయ్యారు. ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత రజనీ కాంత్ కాస్త ఇబ్బంది పడ్డారు. హిట్ లు లేక కొన్ని రోజులు ఎదురు చూసిన పరిస్థితి. ఆ తర్వాత శంకర్ తో రోబో సినిమా చేసి మంచి హిట్ కొట్టారు. ఇదిలా ఉంచితే ఈ సినిమాలో విలన్ ఎంపిక విషయంలో కాస్త ప్లాన్ గానే వెళ్ళారు శంకర్. కొత్త విలన్ కావాలి అనుకుని చాలా మందితో స్క్రీన్ టెస్ట్ చేసారు అని సమాచారం. మలయాళ హీరో మమ్ముట్టిని కూడా తీసుకోవాలి అనుకున్నారు.
ఆయన విలన్ గా చేయను అని చెప్పడంతో సుమన్ ని తీసుకోవాలి అనుకున్నారు. సుమన్ కి సాఫ్ట్ హీరోగా మంచి ఇమేజ్ ఉంది. కాని ఆయన్ను నెగటివ్ గా చూపించాలి అని భావించారు శంకర్. స్క్రీన్ టెస్ట్ చేసి ఆయనకు మీసాలు కూడా తీసారు. చాలా మందికి సుమన్ విలన్ అని అర్ధం కాలేదు. ఇప్పటికి కూడా విలన్ ని చూస్తే సుమన్ కాదు అంటారు చాలా మంది.