కొందరు దర్శకులు సినిమాలు చేస్తే స్టార్ హీరోలకు మంచి ఇమేజ్ వస్తుంది. అందుకే వారితో సినిమాలు చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు. గతంలో అయినా ఇప్పుడు అయినా అలాంటి దర్శకులకు మంచి ఇమేజ్ ఉంది. అప్పట్లో దాసరి నారాయణ రావుతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఎదురు చూసేవారు. అలాగే పూరి జగన్నాథ్ కు కూడా మంచి ఇమేజ్ వచ్చింది. అదే విధంగా కోదండ రామిరెడ్డి కూడా చిరంజీవి లాంటి హీరోకి మంచి హిట్ లు ఇచ్చారు. కాని వీళ్ళు ఒక విషయంలో ఫెయిల్ అయ్యారు. అదేంటి అనేది చూస్తే… కొడుకులతో హిట్ సినిమాలు చేయడంలో…
దాసరి
కొడుకు అరుణ్ తో హిట్ సినిమాలు చేసి అతడిని స్టార్ హీరో చేయాలని చూసారు గాని అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి దూరంగా ఉన్నారు.
కోదండ రామిరెడ్డి
కొడుకు వైభవ్ తో ఆయన సినిమాలు చేసారు. కాని కొడుకు సినిమాల మీద ఆసక్తి లేక ఫ్లాప్ అయ్యారు. దీనితో సినిమాలకు దూరం అయ్యారు.
పూరి జగన్నాథ్
ఆకాష్ తో సినిమాలు చేయడానికి పూరి సిద్దంగా ఉన్నా సరే ఇప్పటి వరకు మంచి హిట్ పడలేదు. ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుతూ వచ్చింది. ఇలా ముగ్గురు స్టార్ దర్శకులు కొడుకులను స్టార్ లను చేయలేకపోయారు.
Also Read: తాగి సెట్ కి వచ్చిన డైరెక్టర్, బాలయ్య ఏం చేసారంటే…?