అటు తమిళంలో ఇటు తెలుగులో ఇప్పుడు మార్కెట్ ను మళ్ళీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది త్రిష. తమిళంలో అయితే తన ఫాలోయింగ్ ని ఎక్కడా తగ్గించుకోలేదు. వయసు మీద పడుతున్నా సరే వరుస సినిమాలతో బిజీగా ఉంది. మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పోన్నియన్ సెల్వం సినిమాతో ఆమె మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా రెండో పార్ట్ ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది.
Also Read:ఫిదా కథ అసలు ముందు ఎవరు విన్నారో తెలుసా…?
ఇప్పుడు స్టార్ హీరోలతో ఆమె మంచి సినిమాలు చేస్తుంది. ఇక యాడ్స్ లో కూడా గతంలో కంటే ఇప్పుడు స్పీడ్ గా నటిస్తుంది. అయితే పెళ్లి విషయంలో మాత్రం ఈ హీరోయిన్ క్లారిటీ ఇవ్వడం లేదనే చెప్పాలి. వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే టాక్ వినపడుతుంది. ఇక కెరీర్ లో పీక్స్ లో ఉన్న ఆమె రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తుంది. మూడు నుంచి అయిదు కోట్లు డిమాండ్ చేస్తుంది.
ఈ తరుణంలో ఆమె జనాలకు ఒక షాక్ ఇచ్చింది. ఏకంగా 35 కోట్ల రూపాయలు ఖర్చు చేసి త్రిష ఇంటిని కొనడం చాలా మందిని ఆశ్చర్యపరిచే అంశం. తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటికి దగ్గర్లో త్రిష ఈ ఇంటిని కొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందని అందుకే కొనుక్కుంది అని అంటున్నారు జనాలు.
Also Read:మీడియా ముందే సీఎస్ కు ఎమ్మెల్యే ఫోన్!