సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమాకు మంచి టాక్ వచ్చింది. వసూళ్లు కూడా ఈ సినిమాకు భారీగానే ఉన్నాయి. అఖండ సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ సంపాదించిన బాలకృష్ణ ఈ సినిమాతో మరింత పెంచుకున్నారు అనే చెప్పాలి. ఈ సినిమాలో ఆయన లుక్ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. సినిమాలో దాదాపుగా ఆయనే ఉన్నా ప్రేక్షకులు బోరింగ్ ఫీల్ అవ్వలేదు అనే చెప్పాలి.
Also Read:నా మాటలను వక్రీకరించారు..!
ఇదిలా ఉంచితే ఈ సినిమాలో విలన్ గా నటించిన దునియా విజయ్, అతనికి భార్యగా నటించిన వరలక్ష్మి కి మంచి పేరు వచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్ ను విమర్శకులు సైతం ప్రసంహించారు అనే చెప్పాలి. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ రేంజ్ లో ఆమె నటించింది అంటూ కామెంట్స్ వచ్చాయి. ఆమె బాలకృష్ణ చెల్లెలుగా నటించడం, విలన్ కు భార్యగా నటించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
సినిమాలో ఇదే అసలైన ట్విస్ట్ గా కూడా చెప్పాలి. ఈ సినిమాకు వరలక్ష్మి కంటే ముందు మరో హీరోయిన్ ని అనుకున్నారు. ఆమె ఎవరో కాదు కీర్తి సురేష్. కీర్తి సురేష్ కు కథ చెప్పగా ఆమె నో చెప్పారట. కొన్ని సన్నివేశాలు ఆమెకు నచ్చలేదు అని అందుకే నో అన్నారు అని టాక్. గోపిచంద్ మలినేని కూడా కీర్తి సురేష్ ను ఒప్పించే ప్రయత్నం చేసినా ఆమె నో అన్నారట.
Also Read:‘నిరూపిస్తే ఉరేసుకుంటా’.. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్