ఏ మతం అయినా సరే పెళ్ళికి శుభలేఖ కచ్చితంగా ఇస్తారు. వారి వారి మతాల ఆధారంగా ఆరాధ్య దైవాన్ని శుభాలేఖపై ముద్రిస్తారు. ఇక వివాహ వేడుకల్లో ఏకపత్నీ వ్రతుడైన రాముడి ఫోటో పెట్టకుండా, ఇద్దరు భార్యలు ఉన్న వేంకటేశ్వర స్వామి ఫోటో పెడతారు. దీనికి సంబంధించి చాలా మందిలో సందేహం ఉంది.
Also Read:భూమిలో నీళ్ళు ఎలా గుర్తిస్తారు…? బోర్ వేయడానికి ఏ పద్ధతి ఉపయోగిస్తారు…?
ఇక వివాహ వేడుకలలో కళ్యాణ మండపంలో కూడా వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం, విగ్రహం పెడతారు. రామాలయాల్లో పెళ్ళిళ్ళు జరగకుండా వెంకటేశ్వర స్వామి గుడిలోనే దాదాపుగా జరుగుతాయి. ఏక పత్నీవ్రతుడైన రామచంద్రుని చిత్రపటం పెట్టడానికి ఆలోచిస్తారు. దీనికి కారణం ఏంటీ అంటే… శ్రీరాముడు అంటే భయం కాదు… ఆయన సతీమణి… సీతమ్మ వారు పడిన కష్టాలు తమ బిడ్డ పడకూడదు అనే భయంతో అలా చేస్తారు.
వాస్తవంగా చెప్పాలి అంటే… సీత అనే పేరు పెట్టడానికి కూడా భయపడుతూ ఉంటారు. సీత అని కాకుండా సీతా మహాలక్ష్మి, సీతారామలక్ష్మీ వంటివి పెడుతూ ఉంటారు. సీతారాములను ఆదర్శ దంపతులుగా, ప్రేమకు, నమ్మకానికి ప్రతీకలుగా చూడటం జరుగుతుంది గాని… సీతారాముల ప్రస్తావన లేకుండా వివాహ క్రతువు మాత్రం సాగదు. సీతారాముల కళ్యాణ ఘట్టానికి సంబంధించిన శ్లోకం మాత్రం ముద్రిస్తారు. శుభలేఖలో సీతారాముల స్వయంవర చిత్రాన్ని ప్రచురించడం చూస్తాం.
Also Read:పరిశ్రమలకు పవర్ హాలీడే.. జగన్ కు పదవి హాలీడే