అప్పట్లో తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్ – ఏఎన్నార్ అనే మాట వాస్తవం. ఎంత మంది నటులున్నా సరే ఈ ఇద్దరికీ అప్పట్లో మంచి గుర్తింపు వచ్చింది. ఎన్టీఆర్ కంటే అక్కినేని ముందు వచ్చినా సరే ఇద్దరూ సినిమా పరిశ్రమలో ఒకే విధంగా ప్రభావం చూపించారు. ఎలాంటి పాత్రలు వేయడానికి అయినా సరే వెనకడుగు వేసే వారు కాదు ఇద్దరూ. అప్పట్లో వీళ్ళకు పోటీ కూడా ఉండేది కాదు.
ఇక మల్టీ స్టారర్ సినిమాల విషయంలో ఇద్దరూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తమ ఇమేజ్ కి ఎక్కడా ఇబ్బంది రాకుండా మల్టీ స్టారర్ సినిమాలను చేసేవాళ్ళు. దాదాపు 14 సినిమాలు చేసారు ఇద్దరూ కలిసి. 1977లో వచ్చిన చాణక్య చంద్రగుప్త చిత్రం సూపర్ హిట్ అయింది. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. ఎన్టీఆర్ కు ఎప్పటి నుంచో చాణక్య పాత్ర పోషించాలి అని ఒక కోరిక ఉండేది.
దాని కోసం కథ కూడా రాసుకున్నారు. అది మల్టీ స్టారర్ సినిమా. అయితే చివరికి అక్కినేని… చాణక్య పాత్ర తాను చేస్తాను అని అన్నారట. వాస్తవానికి ఇద్దరి మధ్య అప్పట్లో విభేదాలు ఉన్నాయనే వార్తలు వచ్చేవి. కాని ఈ సినిమా కోసం ఇద్దరూ కలవడంతో ఆ అపవాద పోయింది. అక్కినేని అడగడం తో ఎన్టీఆర్ నో అనలేదు. ఇది ఎన్టీఆర్ సొంత సినిమా కావడంతో రామకృష్ణా స్టూడియోలో షూటింగ్ చేసారు. ఇందులో తమిళ స్టార్ హీరో జెమిని గణేషన్ కూడా నటించారు.
Also Read: రెడీ ఫర్ రిలీజ్.. ఈవారం 5 సినిమాలు