ఐపిఎల్ ఆక్షన్’ క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఆసక్తిగా ఎదురు చూసేది. తమ తమ జట్లు ఎవరిని కొనుగోలు చేస్తాయి అనే దాని మీద చాలా ఆసక్తిగా అభిమానులు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఐపిఎల్ కు సంబంధించి వేలం పాటపై కూడా అందరూ ఇలాగే చూసారు. ఇక ఈ వేలం పాటలో బాగా హైలెట్ గా నిలిచిన వ్యక్తి గ్రంధి కిరణ్ కుమార్. ఢిల్లీ జట్టుకి ఈయనే యజమాని.
Also Read:సమతామూర్తి బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
జీఏంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సీఈఓ, ఎండీ & డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కిరణ్ కుమార్. ఢిల్లీ జట్టుకి సంబంధించి వేలంపాటలో ఆయన రెగ్యులర్ గా హాజరు అవుతూ ఉంటారు. తాజాగా జరిగిన వేలం పాటలో ఇతర జట్లు చిన్న చిన్న ఆటగాళ్లను ఎక్కువకు కొనుగోలు చేసే విధంగా చేయడమే కాకుండా కీలక ఆటగాళ్లను ఆ జట్టు తక్కువకి కొనుగోలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. డేవిడ్ వార్నర్ ను కేవలం ఆరు కోట్లకే కొనుగోలు చేసారు.
పృథ్వీ షా, కెఎస్ భరత్ లను కూడా మంచి ధరకే కొనుగోలు చేసింది ఢిల్లీ జట్టు. ఈ విషయంలో చాలా కీలక పాత్ర పోషించారు. కుల్దీప్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్ మరియు ముస్తాఫిజుర్ రెహమాన్. శార్దూల్ ఠాకూర్ విషయంలో కాస్త ఎక్కువగా ఖర్చు చేసినా సరే… కిరణ్ కుమార్ మాత్రం సత్తా చాటారు. ఈసారి కూడా ఆయన ఫుల్ ఫాం లో కనిపించారు. దీనిపై ట్విట్టర్ లో ప్రసంశలు కురిపిస్తున్నారు. ఈయన దెబ్బకు ఇతర జట్ల ఓనర్లు షాక్ అయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన నవ్వే ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Read Also:కేసీఆర్ సారు.. ఇక మీ డ్రామాలు కట్టిపెట్టండి. మీకు రోజులు దగ్గర పడ్డాయి