అక్కినేని నాగార్జున సినిమాలు అనగానే ఒకప్పుడు అమ్మాయిల్లో ఒక రేంజ్ క్రేజ్ ఉండేది. మన్మధుడు సినిమా తర్వాత ఆయనకు మంచి రొమాంటిక్ ఇమేజ్ వచ్చి అక్కడి నుంచి మన్మధుడు అయిపోయారు.
ఇక ఆ తర్వాతి నుంచి ఆయన ఏ సినిమా చేసినా ముందు సినిమా హాల్ కు అమ్మాయిలే వచ్చే వారు. 2002 లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన మన్మధుడు సినిమాలో నాగార్జున చాలా అందంగా ఉంటారు.
Also Read:కర్మన్ ఘాట్ లో ఉద్రిక్తత
ఈ సినిమాకు నాగార్జునే నిర్మాతగా వ్యవహరించారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఈ సినిమా తర్వాత డిమాండ్ పెరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రేని తీసుకోగా… రెండో హీరోయిన్ గా కొత్తహీరోయిన్ అన్షు ని సెలెక్ట్ చేసారు. ఆ తర్వాత ఆమె హీరో ని ప్రేమించడం ఆ సినిమాలో ఆమె ప్రమాదంలో మరణించడం… నాగార్జున అమ్మాయిలు అంటేనే అసహ్యించుకోవడం వంటివి జరిగాయి.
ఇక ఈ సినిమాలో గుండెల్లో ఏముందో అనే పాట చాలా అందంగా ఉంటుంది. ఇప్పటికీ టీవీ లో వస్తే ఆ పాట చూస్తారు. చాలా మందిని సెలెక్ట్ చేసినా సరే కొత్త అమ్మాయి బాగుందని ఆమెకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నారు. ఆ సినిమా మంచి హిట్ అయింది గాని… ఆ హీరోయిన్ కెరీర్ మాత్రం ముందుకు వెళ్ళలేదు. ప్రభాస్ సరసన ఒక సినిమా చేసినా తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇక తమిళంలో ప్రశాంత్ నటించిన ఒక సినిమాలో చేసినా ఆ తర్వాత లండన్ వెళ్ళిపోయి… సినిమాలకు దూరంగా చదువు మీద ఫోకస్ చేసింది. సచిన్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని… ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తుంది. ఆమెకు ఒక కుమార్తె కూడా ఉన్నారు.