డా.చెరుకు సుధాకర్
ఇంటి పార్టీ అధ్యక్షులు
విశాఖ వెంకటాపురం ఎల్జి పాలిమర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీకేజిలో 11 మంది చనిపోవడం,అనేక మంది తీవ్ర అస్వస్థకు గురికావటం చాల బాధాకరం. నాటి భోపాల్ యూనియన్ కార్బైడ్ లో మిథైల్ గ్యాస్ లీకేజిలో వేల మంది చనిపోయిన ఘటన గుర్తు చేస్తుంది. ముఖ్యమంత్రి జగన్ గారు తీవ్రంగానే స్పందించి యాజమాన్యంపై కేసులు పెట్టి,కోటి రూపాయల ఎక్సక్రెషియా ప్రకటించడం ఆహ్వానించతగినదే. కానీ భవిషత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని పరిశ్రమల్లో నియంత్రణ,భద్రత పెంచడం ద్వార ఇతరులకు మార్గదర్శకం కావాలి.
తెలంగాణ ప్రభుత్వం సింగల్ విండో, టీఎస్ ఐపాస్తో పరిశ్రమలను ఆహ్వానించడం అవసరమే అయినా ప్రమాదాలు,కాలుష్యం నియంత్రణ అంశాలపై జాగ్రత్తలు తీసుకోకపోతే విశాఖ ఘటన రేపు చౌటుప్పల్ , పటాన్చెరు లో పునావృతం కావొచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడుల కోసం, సంపద సృష్టిస్తున్నమన్నా ఆరాటంలో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకూడదు అని కెసిఆర్, కేటీఆర్ గారికి గుర్తు చేస్తున్నాం.
దేశంలో రాష్టంలో చాల పారిశ్రామిక వాడల్లో నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిశ్రమల్లో జరుగుతున్న నిర్లక్ష్యం, డొల్లతనాన్ని కార్మిక సంఘాలు ప్రశ్నించకపోవటం కూడా తప్పే. లాభోపేక్షతో కాలుష్యనియంత్రణ,భద్రత గాలికి వదిలేయ్యడాన్ని అడ్డుకట్టవేయాలి. కేంద్ర ప్రభుత్వం తమ వంతు సహకారాన్ని మాటలకు పరిమితం కాకుండా అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరోపక్క తోటి తెలుగు సోదరులకు ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నాం.
కరోనా కట్టడిలో లక్డౌన్ మంత్రదండంలో పాలనను, పర్యవేక్షణను గాలికి వదిలి వెయ్యడం వల్లనే రైల్వే ట్రాక్ పై వలస కూలీల రైలు ప్రమాద మరణాలు జరిగాయి. ఇప్పటికి అయినా పరిశ్రమలు, రవాణా, సకల రంగాల్లో అన్ని పర్యవేక్షణాలు పూర్తయినంకనే పనులు తిరిగి ప్రారంభించాలి.