చట్టం మీదున్న అమితమైన గౌరవమో…! పుట్టుకతో వచ్చిన పట్టుదలో..! పరీక్షలంటే ఫోబియానో తెలియదు..! ఇప్పటికి 960 టెస్ట్ లకు అటెండ్ అయ్యింది. టెస్ట్స్ అంటే అత్యున్నత ఉద్యోగం తెచ్చిపెట్టేవో, పదోన్నతి కల్పించేవో కాదు.
లైసెన్స్ కోసం ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ పెట్టే ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్స్.అంతేకాదు 11వేల పౌండ్ల ఖర్చుచేసింది. 2005లో తొలి పరీక్ష.. ఏళ్ల తర్వాత విజయం…ఇదీ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఓ మహిళ పడ్డ ప్రయాస..! దక్షిణ కొరియాకు చెందిన చా సా-సూన్ (69) 2005 ఏప్రిల్లో తొలిసారి లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్ రాసింది.
ఆ రాత పరీక్షలో ఆమె ఫెయిల్ అయింది. ఆ తర్వాతి రోజు నుంచి వారానికి ఐదు రోజులు డ్రైవింగ్ పరీక్ష రాస్తూనే ఉంది. ఇలా మూడేళ్ల పాటు క్రమం తప్పకుండా వారానికి ఐదు రోజులు పరీక్షకు హాజరైంది.
మూడేళ్లలో 780 ప్రయత్నాలు చేసింది. వీటన్నింటిలోనూ అదే ఫలితం. ప్రతి పరీక్షలోనూ విఫలం.! చా సా-సూన్ స్థానంలో మరెవరున్నా ప్రయత్నాన్ని విరమించేవారేమో!
కానీ పట్టువదలని విక్రమార్కుడిలా సా-సూన్ ముందుకు సాగింది. మరీ వారానికి ఐదు రోజులంటే.. విసుగ్గా అనిపించిందో ఏమో.. మూడేళ్ల తర్వాత వారానికి రెండుసార్లే పరీక్షకు వెళ్లడం మొదలుపెట్టింది.
ఇలా ఏడాదిన్నరకు పైగా ప్రయత్నాలు చేసింది. చివరకు ప్రాక్టికల్ టెస్టుకు ఎంపికైంది. పది సార్లు ప్రయత్నించి ప్రాక్టికల్ టెస్టులోనూ పాసైంది. మొత్తంగా 960 ప్రయత్నాల తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందింది చా సా-సూన్.
కూరగాయలు అమ్మే వ్యాపారంలో ఉన్న ఈ మహిళకు డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరం. అందుకే అన్నిసార్లు ప్రయత్నించింది. ఈ క్రమంలో దాదాపు 11 వేల పౌండ్లు (రూ.11.16లక్షలు) వెచ్చించింది.
చా సా-సూన్కు లైసెన్స్ రాగానే తమపై భారం దిగినట్లు అనిపించిందని ఆమెకు డ్రైవింగ్ నేర్పించిన జోన్బుక్ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుడు తెలిపాడు. ఇన్ని ప్రయత్నాలు చేసిన ఆమె.. దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు.
సెలెబ్రిటీగా మారిన ఆమె హ్యుందాయ్ కార్ల యాడ్లోనూ కనిపించారు.ఆ కంపెనీ చా సా-సూన్కు 11,640 పౌండ్ల (రూ.11.82లక్షలు) విలువ చేసే ఓ కొత్త కారును గిఫ్ట్గా ఇచ్చింది. నిజానికి ఈ కథంతా 15ఏళ్ల కింద జరిగినదే.
ఇటీవల ఓ యూజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడిట్లో ఈ స్టోరీని షేర్ చేయగా మరోసారి వైరల్గా మారింది. నెటిజనం అంతా దీనిపై తమ అభిప్రాయాలను చెబుతూ రీపోస్ట్ చేస్తుండటం వల్ల మళ్లీ దీనిపై చర్చ జరుగుతోంది.
South Korean Woman Gets Driving License After 960 Attempts.
– She first attempted the written test back in April 2005 and after failing for the first time, she continued to retake the test every single day, five days a week, for three years@elonmusk#FLOWER#MAFSAU#IRENE… pic.twitter.com/Qr1G5hrtR1
— WePalaver (@WPalaver) March 28, 2023