సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాల సంఖ్య తక్కువ, భార్యాభర్తల బంధాన్ని కొనసాగించేవాళ్ళ సంఖ్య ఇంకా తక్కువ. అలా కలిసిజీవించే వాళ్ళలో మహేష్, నమ్రత జంట ఒకటి. పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పారు కుటుంబానికి అంకితమయ్యారు. మొదట్లో నమ్రతతో పెళ్లికి సూపర్ స్టార్ కృష్ణ నో చెప్పారట. దానికి కారణం మహేష్ బాబుకు ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేయాలని కృష్ణ అనుకున్నారట.ఇక్కడి పద్ధతులు కట్టుబాట్లు తెలిసి ఉంటాయి కాబట్టి తెలుగు అమ్మాయి అయితే బెటర్ అని కృష్ణ అభిప్రాయం.
కానీ ఇంతలో మహేష్ బాబు నమ్రతను సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడంతో కృష్ణ సైతం అంగీకరించక తప్పలేదు. ఆ తర్వాత ఇద్దరినీ చూసి కృష్ణ కూడా సంతోషించేవారట. ఇది ఇలా ఉంటే నమ్రత కుటుంబం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అవేంటో తెలుసుకుందాం…నమ్రత మహారాష్ట్రలో పుట్టి పెరిగింది. 1977 జనవరి 22న ముంబైలో జన్మించింది. నమ్రత శిరోద్కర్ తండ్రి నితిన్ శిరోద్కర్ అప్పట్లో క్రికెటర్ గా రాణించారు. ముంబై తరఫున ఆడే దేశ వాలి క్రికెట్ లో నమ్రత తండ్రి ఎంతో పేరు సంపాదించుకున్నారు.
దిలీప్ వెంగాసర్కార్…. సునీల్ గవాస్కర్ లాంటి స్టార్ క్రికెటర్లతో సైతం నితిన్ శిరోద్కర్ క్రికెట్ ఆడేవారట. ఆయన ఆట తీరు చూసి తోటి క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోయేవారట. అంతేకాకుండా క్రికెట్ లో ఆయన అద్భుతమైన బౌలర్ గా రాణించారు.
ఇక నమ్రత తల్లి కూడా కూడా సెలబ్రిటీలు అన్న విషయం చాలామందికి తెలియదు. నమ్రత తల్లి సైతం మోడల్ గా రాణించారు. నమ్రత కూడా ఒకప్పుడు మోడలింగ్ లో పేరు సంపాదించుకున్నారు.
అంతే కాకుండా1993లో మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. అదేవిధంగా మిస్ యూనివర్స్ పోటీలకు సైతం నమ్రత ఎంపికయ్యారు. మిస్ యూనివర్స్ గా 5వ స్థానంలో నిలిచారు.