సాధారణంగా చాలా సినిమాల్లో ఐటెమ్ సాంగ్ అంటే సెకండ్ హాఫ్‌లో సినిమా చివర్లో ఉంటుంది. అయితే పుష్పలో మాత్రం ఇంటర్వెల్ కు ముందే సమంత ‘ఊ అంటావా మావా’ సాంగ్ తో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడీ న్యూస్ హల్ చల్ చేస్తోంది.
ఈ పాట మాస్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ అని.. ఇందులో బన్నీ, సమంత స్టెప్పులు అభిమానులను ఉర్రూతలూగిస్తాయని మేకర్స్ చెప్తున్నారు. సెకండ్ హాఫ్‌లో భారీ యాక్షన్ సీన్స్ ఉండటంతో.. డైరెక్టర్ సుకుమార్ ఫస్ట్ హాఫ్ లోనే సాంగ్ ను సెట్ చేసినట్టు టాక్.
దట్టమైన అటవీ ప్రాంతంలో బైక్ చేజ్ సీన్ ఒకటి సెకండ్ హాఫ్ లో రూపొందించాడట సుక్కు. సినిమాకు ఇదే హైలైట్ కానుందని ఫిల్మ్ నగర్ టాక్.