హైదరాబాద్ లోని కొంగరకలాన్ లో ఫాక్స్ కాన్ ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ఫాక్స్ కాన్ ఛైర్మన్ యంగ్ లియూ తెలిపారు. ఈ మేరకు యంగ్ లియూ సీఎం కేసీఆర్ కు ఓ లేఖ రాశారు.
కొంగరకలాన్ లో వీలైనంత త్వరలో ఫాక్స్ కాన్ ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటు చేస్తామని.. ఈ పార్కుకు మీ అందరి సహకారం కావాలని లేఖలో కోరారు. హైదరాబాద్ లో తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
మిమ్మల్ని కూడా తైవాన్ కు ఆహ్వానిస్తున్నామని..మీరు నా పర్సనల్ గెస్ట్ అని యంగ్ లియూ పేర్కొన్నారు. కాగా, ఇటీవల హైదరాబాద్ లో పర్యటించిన యంగ్ లియూ నగరంలో ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లతో భేటీ అయిన సంగతి తెలిసిందే.