నిరుద్యోగ యువతకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL చక్కని అవకాశం కల్పించింది. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 24 చివరి తేదీగా ప్రకటించింది. మొత్తం 21 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులున్నాయి. ఫ్రెషర్‌తో పాటు స్కిల్డ్ సర్టిఫికెట్ హోల్డర్లను ఈ పోస్టుల్లో ఆ సంస్థ నియమించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు & పుదుచ్చెరి, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లోని ఐఓసీఎల్ యూనిట్లలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.iocl.com/ వెబ్‌సైట్‌లో Careers సెక్షన్‌లో Apprenticeships క్లిక్ చేసి చూడొచ్చు.
IOCL Data Entry Operator Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే…
తెలంగాణ- 3
ఆంధ్రప్రదేశ్- 3
తమిళనాడు & పుదుచ్చెరి- 8
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 24
పరీక్ష తేదీ- 2020 మార్చి 8
సర్టిఫికెట్ వెరిఫికేషన్- 2020 మార్చి 12
విద్యార్హత- 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి.
వయస్సు- 18 నుంచి 24 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు.