సోషల్ మీడియాలో ప్రస్తుత తరుణంలో ఫేక్ వార్తలు ఎలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయో అందరికీ తెలిసిందే. ఇంటర్నెట్‌లో వస్తున్న వార్తలో అసలువి ఏవో, నకిలీవి ఏవో గుర్తించడం కష్టతరంగా మారింది. ఈ ఫేక్ న్యూస్ వల్ల సామాన్యులకే కాదు, అధికారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఫేక్ న్యూస్‌ను నిజమే అని నమ్మి బొక్క బోర్లా పడుతున్నారు. తాజాగా ఓ ఐఏఎస్ కూడా ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేశారు.
చిత్రంలో చూస్తున్నారు కదా. ఓ లెక్చరర్ ఓ బిడ్డను ఎత్తుకుని విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. అయితే ఇది 2016 సంవత్సరానికి చెందినది. ఓ విద్యార్థినికి చెందిన బిడ్డను ఆ ప్రొఫెసర్ అలా ఎత్తుకున్నాడు. దీంతో ఆమె సులభంగా నోట్స్ రాసుకోవచ్చని అతను ఆ పని చేశాడు. అయితే ఆ ఫొటో ఎలా వచ్చిందో, ఎవరు పంపారో తెలియదు కానీ.. ఛత్తీస్‌గడ్ ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఆ ఫొటోను తాజాగా ట్వీట్ చేశారు.
His wife passed away during Childbirth. But he has taken responsibility for taking the child and college classes together.
The real life Hero.🙏 pic.twitter.com/aJ3siILxCx
— Awanish Sharan (@AwanishSharan) February 3, 2021
ఆ ఫొటోలో ఉన్న లెక్చరర్‌కు చెందిన భార్య పురిటినొప్పులు పడుతూ బిడ్డకు జన్మనిచ్చి చనిపోయిందని, అందుకనే అతను బిడ్డను ఎత్తుకుని మరీ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడని అవనీష్ ట్వీట్ చేశారు. అయితే ఈ ఫోటోను కొందరు గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. అది ఫేక్ వార్త అని తేలింది. అది పైన తెలిపిన విధంగా 2016 ఫొటో అని నిర్దారించారు. ఇక కొందరు యూజర్లు ఈ ఫోటోకు చెందిన అసలు వార్త లింక్‌ను సదరు ఐఏఎస్‌కు షేర్ చేశారు. సార్.. మీరు పొరపాటు చేశారు, అది తప్పు న్యూస్, సరిదిద్దుకోండి, తప్పుడు వార్తలను మీరే ప్రచారం చేస్తే ఎలా..? అంటూ కొందరు నెటిజన్లు ట్వీట్ చేశారు. కాగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Dear @AwanishSharan you're an IAS officer. Doesn't look okay for you to spread a false story despite being informed about it. This is a teacher who carried his students child so she could take notes. It's a post from 2016. Kindly take down or clarify.
https://t.co/5adzERm54H— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) February 3, 2021