అమెరికాకు చెందిన ఆపిల్ సంస్థ కొత్తగా ఆవిష్కరించిన ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్‌లకు బుకింగులు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 3500 విక్రయశాలలలో 27 నుంచి అమ్మకాలు జరుగుతాయి.
బుకింగ్ చేసుకున్న వారికి ఆ రోజు నుంచి ఫోన్లు డెలివరీ చేయడం జరుగుతుంది. ఐఫోన్‌లను 6 వాయిదాల్లో వడ్డీ లేకుండా హెచ్.డి.ఎఫ్.సి. కార్డులపై కొనుగోలు చేసుకోవచ్చు. ఆరు వేల నుంచి ఏడు వేల దాకా నగదు వెనక్కి లభించే అవకాశం ఉందని విక్రయ సంస్థలు చెబుతున్నాయి.