ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ యాపిల్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా ఫిబ్రవరి 17వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు ఐఫోన్లతోపాటు, యాపిల్ ఐప్యాడ్, ఎయిర్‌పాడ్‌లను తగ్గింపు ధరలకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.
యాపిల్ ఐఫోన్ 12 మినీ ధర రూ.64,490 ఉండగా సేల్‌లో దీనిపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో రూ.9వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పాత ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.12,400 వరకు ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్ లో యాపిల్ ఎ14 బయానిక్ చిప్‌సెట్, 5.4 ఇంచుల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 5జి తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
యాపిల్ ఐఫోన్ 11 ప్రొ 128జీబీ మోడల్ ధర రూ.82,900 ఉండగా, సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో రూ.9వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.12,400 వరకు తగ్గింపు ధరను పొందవచ్చు. ఇక ఐప్యాడ్‌పై రూ.6వేల సాధారణ డిస్కౌంట్‌ను, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో అదనంగా మరో రూ.3వేల డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. యాపిల్ ఎయిర్ పాడ్స్ (విత్ చార్జింగ్ కేస్) ధర రూ.12,490 ఉండగా.. వీటిపై రూ.2వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.