యాపిల్‌కు చెందిన ఐఫోన్ 12 మినీ ఫోన్‌ను కొనాలని చూస్తున్నారా ? ఇటీవలే ముగిసిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఈ ఫోన్‌ను కొనలేకపోయారా ? అయితే దిగులు పడకండి. ఎందుకంటే అంతకంటే బెటర్ ఆఫర్‌ను అమెజాన్ ప్రస్తుతం అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ.9వేల డిస్కౌంట్‌తో వినియోగదారులు ప్రస్తుతం అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 12 మినీ ఫోన్ ధర ప్రస్తుతం రూ.64,490గా ఉంది. దీనిపై అమెజాన్‌లో రూ.9వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఫోన్ రూ.55,490 ధరకే లభిస్తోంది. అయితే అందుకు వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను వాడాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు ఈఎంఐ, డెబిట్ కార్డు ఈఎంఐ, క్రెడిట్ కార్డు సాధారణ ట్రాన్సాక్షన్ అయితే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అదే డెబిట్ కార్డు ద్వారా ఈఎంఐ పెట్టకుండా కొంటే రూ.4,500 వరకు డిస్కౌంట్ ఇస్తారు.
అయితే ఈ ఆఫర్ కేవలం ఆదివారంతో ముగుస్తుంది. అందువల్ల వినియోగదారులకు ఈ ఆఫర్‌ను పొందేందుకు కేవలం ఒక్క రోజు మాత్రమే గడువుంది. కాగా ఐఫోన్ 12 మినీ ఫోన్‌తోపాటు యాపిల్ గతేడాది ఐఫోన్ 12, 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్ ఫోన్లను విడుదల చేసింది. వీటన్నింటిలోనూ 5జి, యాపిల్ ఎ14 బయానిక్ చిప్‌సెట్‌ను అందిస్తున్నారు. కానీ ఐఫోన్ 12 మినీ డిస్‌ప్లే ఇతర ఐఫోన్ 12 మోడల్స్ కన్నా చిన్నగా ఉంటుంది. 5.4 ఇంచుల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఇందులో లభిస్తుంది.