యాపిల్ సంస్థ ఉత్పత్తి చేసే ఐఫోన్లకు ఎంతో పేరుంది. వాటిని వాడేందుకు చాలా మంది ఆసక్తిని కనబరుస్తుంటారు. ఈ క్రమంలోనే ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఏ మోడల్ ఐఫోన్‌ను కొని వాడాలా ? అని చాలా మంది సందేహిస్తుంటారు. అలాంటి వారు కింద తెలిపిన అంశాలను పరిశీలించి తమకు నచ్చిన ఐఫోన్ మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 12
ఐఫోన్ 12 ప్రొ లాగే ఐఫోన్ 12లోనూ అనేక ఫీచర్లు ఉన్నాయి. కానీ దాని కన్న ఈ ఫోన్ ధర తక్కువగా ఉంటుంది. ఇందులో 6.1 ఇంచుల ఓలెడ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్‌డీఆర్ సపోర్ట్ లభిస్తుంది. ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ లభిస్తుంది. ఫోన్ 30 నిమిషాల పాటు 6 మీటర్ల లోతు ఉన్న నీటిలో ఉన్నా ఏమీ కాదు. అలాగే యాపిల్ ఎ14 చిప్‌ను ఇందులో అందిస్తున్నారు. ట్రూడెప్త్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 5జి, మాగ్‌సేఫ్‌కు సపోర్ట్ లభిస్తుంది. దీంతో మాగ్నెటిక్ యాక్ససరీలను ఉపయోగించుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. ఐఫోన్ 4 డిజైన్‌ను పోలి ఉంటుంది. కానీ మోడ్రన్ ఫీచర్లు లభిస్తాయి. ఈ ఫోన్‌కు చెందిన 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.79,900 ఉండగా, 128జీబీ మోడల్ ధర రూ.84,900గా ఉంది. 256జీబీ మోడల్ ధర రూ.94,900గా ఉంది.
ఐఫోన్ 12 మినీ
చేతుల్లో సులభంగా ఇమిడిపోయేలా ఉండేలా ఈ ఫోన్‌ను రూపొందించారు. అయినప్పటికీ ఈ ఫోన్ డిస్‌ప్లే 5.4 ఇంచులుగా ఉంది. అయితే మినీ అని పేరుకేగానీ ఫీచర్లు మాత్రం ఐఫోన్ 12ను పోలి ఉంటాయి. ఓలెడ్ డిస్‌ప్లే విత్ హెచ్‌డీఆర్ సపోర్ట్, ఎ14 బయానిక్ చిప్, 5జి, డ్యుయల్ కెమెరాలు, వైర్‌లెస్ చార్జింగ్, ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్, ఎ14 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో లభిస్తున్నాయి. ఈ ఫోన్ 64జీబీ మోడల్ ధర రూ.67,014 కాగా 128జీబీ మోడల్ ధర రూ.71,905, 256జీబీ మోడల్ ధర రూ.84,900గా ఉంది.
ఐపోన్ 12 ప్రొ
ఐఫోన్ 12 ప్రొ, 12 ఫోన్ల ధరలు భిన్నంగా ఉన్నాయి. కానీ ఫీచర్లు మాత్రం దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. రెండింటిలోనూ 6.1 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేశారు. ఎ14 చిప్, 5జి, సెరామిక్ షీల్డ్ ముందు భాగం, ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్, మాగ్ సేఫ్ సపోర్ట్ తదితర ఫీచర్లు లభిస్తున్నాయి. ఐఫోన్ 12లో డ్యుయల్ కెమెరా సెటప్ ఉండగా, ఐఫోన్ 12 ప్రొలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రెండింటిలోనూ డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ సపోర్ట్ లభిస్తుంది. 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఐఫోన్ 12 ప్రొ ధర రూ.1,19,900 గా ఉంది.
ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్
మిగిలిన ఇతర ఐఫోన్ 12 మోడల్స్‌తో పోలిస్తే ఈ ఫోన్ అన్నింటిలోనూ ఎక్కువ స్థాయిలోనే ఉందని చెప్పవచ్చు. ధర, డిస్‌ప్లే సైజ్, బ్యాటరీ, కెమెరాలు.. ఇన్ని అంశాలూ ఇందులో ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.1,27,704గా ఉంది. 6.7 ఇంచుల డిస్‌ప్లే, ఫ్లాట్ డిస్‌ప్లే, మ్యాట్ గ్లాస్ బ్యాక్, ట్రిపుల్ కెమెరా సెటప్, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ధర అంత పెడతాం.. అనుకుంటే ఈ ఫోన్‌ను వాడడం ఉత్తమం.
ఐఫోన్ 11
2019లో ఈ ఫోన్ విడుదలైనప్పటికీ దీనికి ఇంకా ఆదరణ తగ్గలేదు. ఐఫోన్ ప్రియులు ఇప్పటికీ ఈ ఫోన్లను కొంటున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.52,704గా ఉంది. ఐఫోన్ 12 అన్ని ఫీచర్లు ఇందులో లేవు. అయినప్పటికీ ఐఫోన్ 12 కు దగ్గరగా ఫీచర్లు ఇందులోనూ లభిస్తున్నాయి. ఈ ఫోన్‌లో 6.1 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఎ13 చిప్‌సెట్, డ్యుయల్ కెమెరా సెటప్, లాంగ్ బ్యాటరీ లైఫ్, ఐపీ 68 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఇందులో లభిస్తున్నాయి. 5జి అవసరం లేదు, బడ్జెట్‌లో రావాలి అనుకుంటే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ ఎస్ఈ 2020
ఐఫోన్ ఎస్ఈ అటు ఐఫోన్ 11 కాదు, ఇదు ఐఫోన్ 12 కాదు. కానీ ఇంచు మించు ఐఫోన్ 11ను పోలిన ఫీచర్లు ఇందులో ఉంటాయి. కాకపోతే డిస్‌ప్లే సైజ్ తక్కువ. 4.7 ఇంచుల డిస్‌ప్లే లభిస్తుంది. అలాగే యాపిల్ ఎ13 ప్రాసెసర్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 4కె వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్, ఐపీ 67 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు లభిస్తున్నాయి. దీని ప్రారంభ ధర రూ.38,305గా ఉంది.