సమ్మర్ వచ్చేస్తుందంటే చాలు ఐపీఎల్‌పైనే అందరి దృష్టి. కానీ డిసెంబర్ మధ్యలోనే… ఐపీఎల్ హీట్ స్టార్ట్ అవుతుంది. కారణం… ఐపీఎల్‌లో ఆటగాళ్ల వేలం. అయితే ఇప్పటికే ఆయా టీంలు అన్ని తమకు కావాల్సిన ప్లేయర్లను అంటిపెట్టకొని మిగతా వారిని వదలించుకున్నాయి.
ఆ నలుగురిని ఉరితీస్తే సమాజం మారుతుందా
కానీ అనూహ్యంగా వేలంలోకి వచ్చిన ఆ ముగ్గురి చుట్టే ఇప్పుడు చర్చంతా నడుస్తోంది. పోనీ ఆ ఆటగాళ్లు సమర్థులు కారా అంటే… మ్యాచ్ విన్నర్లు. మంచి హిట్లర్లు కూడా. ఏ క్షణంలో అయినా మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం ఉన్న వారు. దీంతో ఇప్పుడు వారిని ఎవరు తీసుకుంటారు, ఎంత ధర పలుకుతారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.
టూరిస్టుల వెంటబడ్డ పులి… పరుగో పరుగు
ఆ ముగ్గురిలో క్రిస్‌లిన్ ఒకరు. ప్రస్తుతం కోల్‌కతా టీంకు ఉన్న క్రిస్‌లిన్ ఇప్పుడు వేలంలోకి వచ్చేశారు. 9.6కోట్లు పెట్టి కొన్న నైట్ రైడర్స్ వదిలేయటంతో… 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చారు. అసలు కోల్‌కతా ఎందుకు అతన్ని వదిలించుకుందో ఇప్పటికీ అందరికీ ఆశ్చర్యంగానే ఉంది.
పోలీసులు కాల్చివేసిన ఆ 17 మంది గ్రామస్థులే…
మరో ప్లేయర్ మాక్స్‌వెల్. ధనాధన్ ఆటలో మాక్స్‌వెల్ కింగ్ లాంటి ప్లేయర్. కాకపోతే… ఎప్పుడు ఆడతాడో, ఎప్పుడు అవుట్ అవుతాడో ఎవరికీ తెలియదు. అస్సలు నిలకడ ఉండదు. దాంతో భారీ ఆశలతో 2కోట్లు ఉన్న మాక్స్‌వెల్‌ను 9కోట్లు పెట్టి కొన్న ఢిల్లీ వదలించుకుంది. ఇప్పుడు మళ్లీ వేలంలో మాక్స్‌వెల్ ఏ జట్టుకు చేరుతాడో అన్నది ఆసక్తిగా ఉంది. కానీ ఆడిన రోజు మాత్రం… చూస్తుండగా మ్యాచ్‌ను లాగేసుకునే సామర్థ్యం ఉన్న ఆటగాడు ఈ కివీస్ ప్లేయర్.
ఇక మూడో ఆటగాడు ఆరోన్ ఫించ్. ఈ ఆసీస్ ఆటగాడిది అదే పరిస్థితి. ఇండియన్ పిచ్‌ల మీద తడబడే అలవాటున్న ఈ ఆటగాడు… గత సీజన్‌లో ఆడలేదు. అంతకుముందు కూడా పెద్దగా ఆడకపోయినా… బంతిని బాదటంలో మంచి రికార్డు ఉన్న వ్యక్తి. పంజాబ్ జట్టులో ఉన్న ఈ ఆటగాడు… ఏ జట్టు వశం అవుతాడో చూడాలి.