క్రికెట్ ప్రియుల ఐపిఎల్ పండుగ వచ్చే సెప్టెంబర్ లో రానుంది.. మామూలుగా అయితే వేసవిలో ఫుల్లు సందడిగా ఉండే ఐపిఎల్ ఈ సారి కరోనా మూలంగా లేట్ అయిన సంగతి తెలిసిందే..ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులే కాదు, క్రికెటర్స్ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు..ఈ నేపద్యంలో డేవిడ్ వార్నర్ పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది..
ఐపిఎల్ ట్రోపి ఇమేజ్ పోస్ట్ చేస్తూ..ఈ సారి ఎవరు విన్ అవుతారు అంటూ ఒక ప్రశ్న సంధించాడు వార్నర్.. సాధారణంగా సెలబ్రిటిలు పోస్ట్ చేయడం వరకే..కానీ వార్నర్ ఆ పోస్ట్ కి రిప్లై పెట్టిన వాళ్లందరికి సమాధానాలిచ్చాడు.. ఏంటో తెలుసా.. మనోడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడి గెలిపించాడు..ఇఫ్పుడు దాని తరపునే ఆడుతున్నాడు.. సో సన్ రైజర్స్ గెలుస్తాడు అని చెప్పినవాళ్లందరికి ఉత్సాహంగా థాంక్యూ చెప్పాడు..
ఇకపోతే ఇప్పటివరకు ఒక్కసారి ఐపిఎల్ గెలవని టీం RCB(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్).. ఫైనల్ కి వచ్చి కూడా రెండు సార్లు ఓడిపోయారు.. ఆ టీంని మెన్షన్ చేస్తే లాఫింగ్ ఇమోజిస్ ఇచ్చాడు.. CSK (చెన్నై సూపర్ కింగ్స్) కి కూడా సేమ్ రియాక్షన్ ఇవ్వగా, ఇప్పటివరకు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్(MI) ని మెన్షన్ చేసిన వారికి మాత్రం చూస్కుందాం..వాళ్లో మేమో అని సవాల్ విసురుతున్నట్టుగా రిప్లై ఇచ్చాడు..
వార్నర్ పోస్ట్ తో పాటు,,కామెంట్స్ కి వాటి రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారింది.. మరి RCB ఈ సారైనా తన సత్తా చాటుకుంటుందో.. లేకపోతే వార్నర్ కోరుకున్నట్టుగా తనే విజేతగా నిలుస్తాడో చూడాలి…