ముంబై ఇండియన్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ లో చెన్నయ్ సూపర్ కింగ్స్ మరో రికార్డును సృష్టించింది. అత్యధిక సార్లు చివరి బంతికి విజయం సాధించిన జట్టుగా చెన్నయ్ సూపర్ కింగ్స్ రికార్డు నెలకొల్పింది.
ముంబైతో మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో చెన్నయ్ 17 పరుగులు చేసింది. ముఖ్యంగా చివరి బంతిని బౌండరీగా మలిచి చెన్నయ్ కు మిస్టర్ కూల్ ధోనీ మరోసారి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
దీంతో ఇప్పటి వరకు చెన్నయ్ అత్యధికంగా ఎనిమిది సార్లు చివరి బంతికి విజయాలు సాధించింది. ఆ తర్వాత స్థానంలో ఆరు సార్లు చివరి బంతి విజయాలతో ముంబై నిలిచింది.
ఇక ఈ మ్యాచ్ లో మొదటి టాస్ గెలిచిన చెన్నయ్ బౌలింగ్ ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ దిగిన ముంబై 155 పరుగులు చేసింది. ఛేజింగ్ కు వచ్చిన చెన్నయ్ ఆఖరిబంతికి విజయాన్ని సాధించింది.