ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా మరో రికార్డు సృష్టించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో పది పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన ఆటగాడిగా బుమ్రా రికార్డు సాధించాడు.
ఇంతకు ముందు ఈ రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ వానిందు హసరంగా పేరిట ఉండేది. హసరంగా 18 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో బూమ్రా ఇప్పటి వరకు మొత్తం పది వికెట్లు తీశాడు.
దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలో బూమ్రా ఐదవ స్థానంలో నిలిచాడు. ఐపీఎల్స్ లో ఇప్పటి వరకు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన గుజరాత్ టైటాన్స్ బౌలర్ అల్ జారీ జోసెఫ్ ( 12 పరుగులకు 6 వికెట్లు) పేరిట ఉంది.
కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో బూమ్రా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ముంబై ఇండియన్స్ కేవలం 17.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది.