క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదరు చూస్తున్న తరుణం రానే వచ్చింది. 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక నుంచి కనువిందు చేయనుంది.16వ సీజన్ గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో అంగరంగ వైభవంగా ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవ వేడుక జరిగింది.
మరికాసేపట్లో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. మ్యాచ్ను వీక్షించేందుకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. స్డేడియం బయట, లోపల ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. మైదానం రంగరంగుల కాంతులతో మస్తుగా ముస్తాబైంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తమన్నా, రష్మిక.. తమ ఆట పాటలతో అభిమానులను ఉర్రతలూగించారు. సిల్వర్ కలర్ డ్రెస్లో తమన్నా ‘పుష్ప’ సినిమాలోని ఊ అంటావా సాంగ్కు అదిరిపోయేలా చిందులు వేసింది.
వివిధ భాషల పాటలకు డ్యాన్స్ చేస్తూ.. ప్రేక్షకులను తెగ అలరించింది. టాలీవుడ్ సినిమా ‘పుప్ప’లోని ‘ఊ అంటావా మావ’ పాటకు చిందులేసింది. ఇక హీరోయిన్ రష్మిక మంధాన పుష్ప సినిమాలోని ‘సామి సామీ’, ‘శ్రీ వల్లి’ పాటలకు అదిరిపోయే స్టెప్పులేసి ఫ్యాన్స్లో జోష్ నింపింది.
‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు పాటకు నృత్యం చేసి అలరించింది. ప్రముఖ సింగర్ అర్జిత్ సింగ్ తన పాటతో సందడి చేశారు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని ‘కేసరియా’ పాటను పాడి అలరించారు.ఇక నందమూరి నటసింహం బాలయ్య కామెంటేటర్గా కొత్త అవతారం ఎత్తారు. ఈ సందర్భంగా వేడుకకు సంబంధించిన ఫొటోలు మీకోసం.