క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. మొదటి మ్యాచ్ మార్చి 31న జరగనుంది. ఈ సీజన్ లో మొత్తం 10 జట్లు 70 మ్యాచ్ ల్లో తలపడనున్నాయి.

ఐపీఎల్ ఆరంభ వేడుకలు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్నాయి. మార్చి 31న మొదటి మ్యాచ్ లో చెన్నైసూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఏప్రిల్ 2న హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
మే 21 వరకు లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. మే28న అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ మొత్తం 52 రోజుల పాటు ప్రేక్షకులను అలరించనుంది. ఈ సీజన్లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు ఉంటాయి. షెడ్యూల్ ప్రకారం మొత్తం 52 రౌండ్ల రాబిన్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
వీక్ డేస్‌లో ఓ మ్యాచ్ ఉండగా వీకెండ్ లో మాత్రం అభిమానుల కోసం డబుల్ హెడర్‌లు షెడ్యూల్ చేశారు. ఈ సీజన్లో మొత్తం 18 డబుల్ హెడర్‌లు ఉన్నాయి. డే గేమ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకు, ఈవెనింగ్ మ్యాచ్‌లు సాయంత్రం 07:30 గంటలకు ప్రారంభమవుతాయి.
తొలి లీగ్ రౌండ్లో అన్ని ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడనున్నాయి. లీగ్ మ్యాచ్ లు ముగిశాక ఫైనల్స్‌కు చేరువగా ఉన్న జట్లు ప్లే ఆఫ్స్ రూపంలో మరో నాలుగు మ్యాచ్‌ల్లో తలపడతాయి. ఫైనల్స్ మ్యాచ్‌లు కలిపితే మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.