క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. 2021 ఐపీఎల్ వేలం తేదీ కన్ఫామైంది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఆక్షన్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఐపీఎల్ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించింది. ‘గమనిక.. ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం. వేదిక: చెన్నై’ అంటూ ట్వీట్ చేసింది.
ఇదిలాఉంటే.. ఈ వేలంలో అత్యధిక సొమ్ముతో పంజాబ్ రెడీ అవుతోంది. కింగ్స్ ఎల్‌వెన్ పంజాబ్ వద్ద రూ. 53.2 కోట్లు ఉన్నాయి. ఆ తర్వాత బెంగళూరు-రూ.35.7 కోట్లు, రాజస్థాన్- రూ.34.85 కోట్లు, చెన్నై రూ.22.9 కోట్లు, ముంబై-రూ.15.35 కోట్లు, ఢిల్లీ -12.8 కోట్లు, కోల్‌కతా-రూ.10.85 కోట్లు, సన్‌రైజర్స్ వద్ద రూ.10.75 కోట్లు ఉన్నాయి.