ఐపిఎల్ 2021 ఫేజ్-2 సెప్టెంబర్ 19 నుండి యుఎఇలో ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ MI, CSK మధ్య జరిగింది. ఇందులో చెన్నై మ్యాచ్ గెలిచింది. ఇక యుఎఇలో జరుగుతున్న ఐపిఎల్ ఫేజ్-2 మ్యాచ్ ను వీక్షించడానికి కొన్ని షరతులతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) స్టేడియం ఓపెన్ చేసింది. 31 మ్యాచ్‌లతో ఐపీఎల్ మరింత ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రపంచమంతా ఐపిఎల్‌ని ఆస్వాదిస్తుండగా, ఆఫ్ఘనిస్తాన్‌లో మాత్రం ఐపిఎల్ ప్రసారం చేయవద్దని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. తాలిబాన్ల కొత్త చట్టం దీనికి కారణం.
ఐపిఎల్ కంటెంట్ ఇస్లాం వ్యతిరేకమని, కాబట్టి ఐపిఎల్ ప్రసారం చేయబోమని తాలిబాన్లు తెలిపారు. మ్యాచ్ సమయంలో చీర్ లీడర్స్ డ్యాన్స్ చేస్తారని, ఇది ఇస్లామిక్ సంస్కృతికి విరుద్ధమని వారు అంటున్నారు. కొత్త తాలిబాన్ చట్టం ప్రకారం మహిళలు హిజాబ్ ధరించినా ఒంటరిగా బయటకు రాకూడదు. వాళ్ళు ఎప్పుడూ ఒంటినిండా బట్టలు ధరించి కన్పించాలి. అందుకే తాలిబాన్ ఐపిఎల్ ప్రసారాన్ని నిషేధించింది.
దుబాయ్ స్టేడియంలో సెప్టెంబర్ 19 న జరిగిన మ్యాచ్‌లో చెన్నై ముంబైని 20 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. నిన్నటి విజయం తర్వాత చెన్నై రన్ రేట్ కూడా మెరుగైంది. ఇప్పుడు చెన్నైకి 12 పాయింట్లు ఉన్నాయి. టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. CSK 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. చెన్నై ఓపెనింగ్ స్కోర్ అంత బాగా లేనప్పటికీ రితురాజ్ అద్భుతమైన బ్యాటింగ్, బ్రావో ఇన్నింగ్స్ మ్యాచ్ మొత్తాన్ని మార్చాయి. వారి అద్భుతమైన ఆటతో చెన్నై ముంబైని 20 పరుగుల తేడాతో ఓడించారు.