రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించిన 16వ ఐపిఎల్ సీజన్ అట్టహాసంగా ముగియబోతోంది. ఓ వైపు అభిమాన జట్లమధ్య క్రికెట్ పోరు, మరో వైపు దేశీయ సాంక్కృతిక కార్యక్రమాలతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికయ్యింది.
ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుండగా..ఇందులో గెలిచిన జట్టు మే 28న జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది.
ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన బీసీసీఐ…ఫైనల్ మ్యాచ్ ముందు ముగింపు వేడుకలను కూడా అట్టహాసంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో దేశీయ సంగీతకారులతో మనోరంజక ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. వివియన్ డివైన్, జోనిటా గాంధీ, కింగ్, న్యూక్లియా తమ ఆట పాటతో అలరించనున్నారు.